హిట్స్ ను ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం టాప్ హీరోలతో వరసగా సినిమాలు చేస్తున్న కాజల్ కు వెంకటేష్ నుంచి అనుకోని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్స్ సమస్య ఏర్పడటంతో వారంతా కాజల్ వైపు చూస్తున్నారు. ఈమె కూడ వీలైనంత వరకు సీనియర్ హీరోలకు నో చెప్పకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటోంది. 

ఇలాంటి పరిస్థుతులలో తేజా డైరెక్షన్ లో వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో కాజల్ ఎంపిక ఇంచుమించు ఖరార్ చేసారు. స్టోరీ సిటింగ్స్ కూడ పూర్తి అయిన ఈసినిమా నటీనటుల ఎంపిక క్లైమాక్స్ కు చేరుకున్న నేపధ్యంలో వెంకటేష్ కాజల్ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
VENKATESH ALONG WITH KAJAL LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికి కారణం ఈమధ్యనే రానా కాజల్ తో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటించిన నేపధ్యంలో మొన్నటికి మొన్నే రానాతో చేసిన కాజల్ తో వెంటనే తాను నటిస్తే బాగుంటుందా అన్న అనుమానాలు వెంకటేష్ కు వచ్చినట్లు టాక్. దీనితో మరొక హీరోయిన్ ను కాజల్ స్థానంలో వెతకమని వెంకటేష్ తేజాకు చెప్పినట్లు టాక్. 

ఇలాంటి పరిస్థుతులలో ఇప్పటికిప్పుడు మరో హీరోయిన్ ను ఎక్కడ వెతకాలి అని తేజ తల పట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే డిసెంబర్ 13న ప్రారంభం కావలసిన వెంకీ-తేజ సినిమా ఓపెనింగ్ వాయిదా పడినట్లు టాక్. వాస్తవానికి ఆరోజు వెంకటేష్ పుట్టినరోజు అయిన నేపధ్యంలో ఆరోజు ఈసినిమాను ప్రారంభం చేయాలని తేజా భావించాడు. అయితే హీరోయిన్ విషయంలో సమస్యలు ఏర్పడటంతో మరొక డేట్ కు ఈమూవీ షూటింగ్ ప్రారంభం వాయిదా పడినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: