భారత స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేడు జరుగుతున్నాయి. దేశం నలుమూలలా ఎగురుతున్న మువ్వన్నెల జెండా మన దేశ ఐక్యతను సూచిస్తోంది. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో ప్రిన్స్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం మహేష్ అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగిస్తోంది.

మహేష్ కెరియర్ లో తొలిసారి సిఎంగా నటిస్తున్న ‘భరత్ అను నేను’ ఫస్ట్ ఓత్ పేరిట మహేష్ వాయిస్ ఉన్న ప్రమాణ స్వీకారాన్ని కొద్ది సేపటి క్రితం సోషల్ మీడియాలో విడుదల చేసారు. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు గవర్నర్ ఏదైతే రాజ్యంగా బద్ధంగా ప్రమాణం చేయిస్తారో అవేపదాలు పొల్లుపోకుండా మహేష్ చేత రిపీట్ చేయించి అభిమానులకు జోష్ ను కలిగించాడు కొరటాల శివ.

ముఖ్యంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్ వాయిస్ లో మంచి గంభీరత కనిపించడంతో ఈ ఆడియో విని మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో దేవి శ్రీ ప్రసాద్ ఈ ఆడియోను పీక్ కు తీసుకు వెళ్ళాడు.

తెలుగు సినిమాలకు సంబంధించి ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి ‘భరత్ అనే నేను’ శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత చూపుతానని అంటూ మొదలు పెట్టిన ఈ ప్రమాణ స్వీకారం మహేష్ దైవ సాక్షిగా ప్రమాణం చేయడంతో ముగిసింది. ఈ 50 సెకండ్ల ఆడియోకు ఫస్ట్ లుక్ లాంటిది ఏది జత చేయక పోవడం ఇంకా ఈమూవీ టైటిల్ కూడ ప్రకటించక పోవడంతో ఈమూవీ టైటిల్ పై ఇంకా ఒక స్థిర నిర్ణయానికి మహేష్ కొరటాలలు ఇంకా రాలేదు అని అనిపిస్తోంది. మహాత్మాగాంధీ దండి ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించిన ఫోటోను ఈ ఆడియోకు జతచేయడం కొరటాల దేశభక్తిని సూచిస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి