టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  అయితే మొదటి సారిగా మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి కొణిదెల నిహారిక ‘ఒకమనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  మొదట ‘డి’ అనే డ్యాన్స్ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మంచి పర్ఫామెన్స్ తో అందరి మనసు దోచింది. మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంపై మెగా ఫ్యామిలీ అభ్యంతరం తెలిపినా..‘ఒక మనసు’ సినిమా చూసిన తర్వాత ఆ ఒపీనియన్ మార్చుకున్నారట.   
Related image
ప్ర‌స్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెర‌కెక్కుతున్న ఒరు నల్ల నాల్ పాత్రు సోల్రెన్ అనే త‌మిళ‌ చిత్రంతో పాటు హ్యాపీ వెడ్డింగ్ అనే చిత్రాలు చేస్తుంది. హ్యాపీ వెడ్డింగ్ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, ల‌క్ష్మణ్ అనే కొత్త ద‌ర్శ‌కుడు సినిమాని అద్భుతంగా తీసాడ‌ని చెప్పుకొచ్చింది నిహారిక‌.  ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక తనపై వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. 
Related image
నేను మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్ లో పుట్టి పెరిగినదానికి కాబట్టి నటీ, నటులపై ఎన్నో రూమర్లు పుట్టుకు రావడం తెలుసని అన్నారు. అయితే ఆ రూమర్లు సహజంగా ఉండాలే తప్పా అస్సలు సంబంధం లేకుండా ఉంటే అసహ్యంగా ఉంటుందని అన్నారు.  వాటిని ఎదుర్కొనడానికి రెడీ అయ్యే వచ్చాను. తొలి సినిమా చేస్తున్న‌ప్పుడు నాగ‌శౌర్య‌తో లింక్‌పెట్టారు.
Image result for niharika chiranjeevi
అత‌డిని పెళ్ళి కూడా చేసుకుంటుంద‌ని ప్ర‌చారం చేశారు. కాగానే మా క‌జిన్ సాయిధ‌ర‌మ్ తేజ్‌తో లింక్ ఉంద‌ని మరీ చండాలంగా ప్రచారం చేశారు. చీ..ఇలాంటి రూమర్లు కూడా సృష్టారా అని నేను అప్పుడు ఎంతో బాధపడ్డానని నిహారిక తెలిపింది.   అయితే వీటిపై ఎక్కువ రోజులు జనాలకు కూడా ఆసక్తి ఉండదని, అందుకే ఒక విషయం పాతగా అయిపోయాకా.. కొత్త వార్తలను కుక్ చేస్తారని నిహారిక చెప్పుకొచ్చింది. 

Image result for niharika mega family


మరింత సమాచారం తెలుసుకోండి: