త్వరలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో త్రివిక్రమ్ ఈమూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈమూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలో కూడ త్రివిక్రమ్ అనేక ఆలోచనలు చేస్తున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ లో నటించే అవకాసం వచ్చినా ఒకప్పటి హీరోయిన్ లయ తిరస్కరించినట్లుగా వార్తలు రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
HEROINE LAYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
త్రివిక్రమ్ సినిమాలలో ఒక కీలక పాత్రను మాజీ హీరోయిన్స్ కు ఇవ్వడం ఒక అలవాటుగా మారింది. ‘అత్తారింటికి దారేది’ లో నదియా ‘అజ్ఞాతవాసి’ లో ఖుష్బూ లకు త్రివిక్రమ్ ప్రత్యేక పాత్రలు సృష్టించడమే కాకుండా ఆ పాత్రలు ద్వారా ఆ మాజీ హీరోయిన్స్ కు విపరీతమైన క్రేజ్ మళ్ళీ వచ్చేలా చేసాడు. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అదే పద్ధతిని రిపీట్ చేస్తూ జూనియర్ తో తీయబోతున్న సినిమాలో ఒక కీలక పాత్ర కోసం లయను త్రివిక్రమ్ సంప్రదించినట్లు టాక్. సుమారు 40 సినిమాలలో నటించిన లయకు గతంలో మంచి నటిగా పేరుండటమే కాకుండా నంది అవార్డ్ లు కూడ వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకుడు అవ్వకముందు రచయితగా పనిచేసిన ‘స్వయంవరం’ సినిమాలో లయ హీరోయిన్ గా నటించింది.
HEROINE LAYA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ పరిచయాలతో ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న లయను త్రివిక్రమ్ జూనియర్ సినిమాలోని పాత్ర విషయమై సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లయ తాను గత పది సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా తన కుటుంబంతో ఉంటున్నానని తిరిగి తనకు సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదు అంటూ త్రివిక్రమ్ కోరికను సున్నితంగా లయ తిరస్కరించినట్లు టాక్. త్రివిక్రమ్ సినిమాలలో చిన్న పాత్ర వచ్చినా చాలు అని చాలామంది భావిస్తూ ఉంటే ఒకనాటి హీరోయిన్ లయ తనకు వచ్చిన భారీ అవకాశాన్ని వదులు కోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: