‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తో ఆసినిమాలో నటించిన నటీనటులు అదేవిధంగా ఆసినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు మంచి జోష్ మీద ఉంటే ఈమూవీలో ఒక పాట పాడిన ఒక సింగర్ మాత్రం తాను మోసపోయాను అంటూ గగ్గోలు పెట్టడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. జానపద పాటలను బాగా వినేవారికి సింగర్ శివ నాగుల పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఈసింగర్ ‘రంగస్థలం’ మూవీలో కూడ ఒక పాట పాడాడు. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమూవీ ఆడియో ఈవెంట్ కి కూడా ఆయనను పిలిచి వేదికపై పాడించడమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆయన గురించి గొప్పగా అందరికీ పరిచయం చేసాడని తెలుస్తోంది. అయితే ఈమూవీ రిలీజ్ అయ్యాక తను పాడిన పాటలో తన వాయిస్ బదులు దేవిశ్రీ గొంతు వినిపించేసరికి శివనాగులు ఖంగు తిన్నాడు అని టాక్. దీనితో తన ఆవేదనను ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెళ్ళగక్కాడు. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కనీసం తాను పాడిన పాటను తన వాయిస్ తో కాకుండా దేవిశ్రీ వాయిస్ తో రీప్లేస్ ఎందుకు చేశారో తెలియక ఈగాయకుడు తీవ్ర అవమానానికి గురైనట్లు బాథ పడుతున్నాడు. ‘రంగస్థలం’ మూవీలో ''ఆ గట్టునుంటావా'' పాట ఈమూవీ ఆల్బమ్ లో శివ నాగులు వాయిస్ ఉంచినా ఈసినిమా దగ్గరకు వచ్చేసరికి అతడి వాయిస్ బదులు దేవిశ్రీ పాడటానికి దర్శకుడు సుకుమార్ ఒక కారణం చెపుతున్నాడు.  
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఆ పాట షూట్ చేస్తున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ తోనే తాము షూట్ చేసామని అయితే ఆ తరువాత ఈపాటను దేవిశ్రీ ప్రసాద్ శివ నాగులు చేత పాడించి ఆడియోలో పెట్టించిన విషయాన్ని సుకుమార్ బయటపెట్టాడు. శివ నాగులు ఈపాటను  చాలా మెలొడియస్ గా పాడిన పరిస్థుతులలో ముందుగా దేవిశ్రీ వాయిస్ తో షూట్ చేయడం వల్ల ఎడిటింగ్ లో రామ్ చరణ్  లిప్ మూమెంట్ కు శివ నాగులు పాడిన పాట సింక్ కాకపోవడంతో ఈపాటను ను తీసివేసాము అని అంటున్నాడు సుకుమార్. అయితే కొందరు మాత్రం ఈవిషయం పై కామెంట్స్ చేస్తూ దేవిశ్రీ పెఅసాద్ సంగీత దర్శకత్వం వహించే సినిమాలలో ఏదైనా ఒక పాట ట్యూన్ బాగా వస్తే ఆ సింగర్ పాడిన పాటను తీసేసి తానే పాడుకునే అలవాట్లు దేవిశ్రీకి ఎప్పటి నుంచో ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: