
వెండితెరపై కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం. అలాంటి వాటిలో బాలకృష్ణ, శ్రీదేవి కాంబినేషన్ ఒకటి. నందమూరి తారక రామారావుతో శ్రీదేవి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. వెండితెరపై అదో అందాల జంట.
ఆ సెంటిమెంట్‌తోనే కావచ్చు.. బాలకృష్ణ మాత్రం శ్రీదేవి సరసన నటించలేదు. కానీ శ్రీదేవి అటు అక్కినేని నాగేశ్వరరావుతోనూ.. ఆయన తనయుడు నాగార్జునతోనూ హీరోయిన్ గా నటించింది కూడా. అంతే కాదు. బాలయ్య సమకాలీకులైన చిరంజీవి, వెంకటేష్ వంటి వారితోనూ శ్రీదేవి నటించినా బాలయ్యతో మాత్రం నటించలేదు.
కానీ
ఇప్పుడు మాత్రం శ్రీదేవి
బాలకృష్ణతో నటించింది.
అదెలా
అంటారా..
ఎన్టీఆర్
బయోపిక్ చిత్రంలో శ్రీదేవిగా
కుర్ర నటి రకుల్ ప్రీత్ సింగ్
నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ
చిత్రం ట్రైలర్,పాటల
ఆవిష్కరణ సభలో నటి రకుల్
ప్రీత్ సింగ్ కూడా మాట్లాడింది.
తనకు ది గ్రేట్ శ్రీదేవి పాత్రలో నటించే ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపుతూనే బాలయ్యపై సెటైర్లు వేసిందీ అమ్మడు.. వాస్తవానికి బాలయ్య శ్రీదేవితో నటించలేదని.. కానీ శ్రీదేవి పాత్ర వేసిన తనతో ఇప్పుడు నటించారని కామెడీ చేసింది. అవును మరి.. అలనాటి అందాల శ్రీదేవితో నటించకపోయినా ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య శ్రీదేవి పాత్రలోని రకుల్ ప్రీత్ సింగ్‌తో నటించడం ద్వారా ఆ లోటు తీరిందన్నమాట.