అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100, చీకటి గదిలో చితక్కొట్టుడు.. ఇప్పుడు హిప్పీ... ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగులో కూడా అడల్ట్ సినిమాలు పెరిగిపోతున్నాయని చెప్పొచ్చు.  సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఇలాంటి సినిమాలు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.  అప్పుడెప్పుడో నాగార్జునతో వర్మ శివ సినిమా చేశాక చాలాకాలం పాటు యువత సైకిల్ చైన్లు, బ్యాట్లు పట్టుకొని తిరిగింది.

ఇప్పడు అర్జున్ రెడ్డి సినిమా తరువాత బజార్లో చొక్కాలు విప్పుకొని తిరగడం, జుట్టు గడ్డం పెంచేసి బుల్లెట్ పై తిరగడంతో పాటు మందు సిగరెట్ కు అలవాటు పడిపోతున్నారు.  అంతవరకు సరే... ఇప్పుడు డ్రగ్స్ కు ఎడిక్ట్ అవుతున్నారు.  సినిమా ప్రభావం అది.  ఇదే బాటలో అడల్ట్ కంటెంట్ గా వచ్చిన ఆర్ ఎక్స్ 100 సినిమా ప్రభావం కూడా యూత్ పై పడింది.  


చీకటి గదిలో చితక్కొట్టుడు... హర్రర్ జానర్లో వచ్చిన పచ్చి బూతు సినిమా.  కామెడీని ఇంత దారుణంగా కూడా ఉపయోగించవచ్చా అనే అనుమానం కలుగుతుంది.  ఇప్పుడు ఇదే బాటలో హిప్పీ కూడా నడవబోతున్నది.  ఆర్ ఎక్స్ 100 మూవీ హీరో కార్తికేయ హీరోగా చేసిన ఈ సినిమా జూన్ 6 న రిలీజ్ కాబోతున్నది.  


ఇందులో కూడా కావాల్సినన్ని లిప్ లాక్ లు ఉన్నాయి.  లిప్ లాక్ లు చూపిస్తూనే సందేశాన్ని ఇస్తున్నారట సినిమాలో.  అదేంటో అర్ధం కావడం లేదు.  లిప్ లాక్ లు చూపిస్తూ సందేశాన్ని ఇవ్వడం ఏంటి... పైగా ఇది ప్యారడైజ్ లాస్ట్ అనే నవలను స్ఫూర్తిగా తీసుకొని నిర్మించిన సినిమా అని దర్శకుడు చెప్తున్నాడు.  మరి ఆ సందేశం ఏంటో తెలియాలంటే జూన్ 6 దాకా ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: