సౌత్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అంత సీను ఉండదని అర్జున్ రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న సమయంలో సౌత్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లపై బాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన కొంతమంది కామెంట్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్థానంలో ఉన్న హీరో మట్టానికి కెరియర్ దిగిపోయిన సందర్భాలలో సదరు హీరోలను ఆదుకొన్నది సౌత్ సినిమాలే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలవబడే అమీర్ ఖాన్ కి...గజిని సినిమాతో సూపర్ బ్రేక్ వచ్చింది. అలాగే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరిని నిన్న ఫుల్ ప్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమాగా తెరకెక్కించి అప్పటినుండి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా బాలీవుడ్ లో దుమ్ము దులుపుతున్నాడు. ఇటువంటి క్రమంలో తాజాగా అర్జున్ రెడ్డి సినిమా ని షాహిద్ కపూర్ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి తన కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా ఊహించని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్నాడు.


దీంతో కబీర్ సింగ్ కీ వస్తున్న కలెక్షన్లు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారికి ఫ్యూజ్లులు ఎగిరిపోతున్నాయి. ప్రస్తుతానికి ఇటీవలే 250 కోట్లు సాధించిన ఈ సినిమా 300 కోట్ల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తుంటే కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ టాప్  10 సినిమాలలో ఒక సినిమాగా నిలిచిపోయింది కబీర్ సింగ్.



మరింత సమాచారం తెలుసుకోండి: