ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం కోసం 50 కోట్లకు పైగా ఖర్చుపెట్టి బాలకృష్ణ అప్పట్లో సంచలనంగా మారాడు. అయితే ఆ మూవీ ఫెయిల్యూర్ బాలకృష్ణ ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా విషయంలో బాలయ్య అనుసరిస్తున్న కాస్ట్ కటింగ్ పద్ధతులు పద్ధతులు ఈ మూవీ దర్శకుడు రవికుమార్ కు షాక్ ఇవ్వడమే కాకుండా తలనొప్పి పుట్టిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు హడావిడి చేస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ కోసం ఈమధ్య బ్యాంకాక్ కు వెళ్ళిన బాలకృష్ణ ఒక మోడరేట్ హోటల్ లో తనకు ఎకామిడేషన్ ఇస్తే చాలని చెప్పడమే కాకుండా ఒక మాదిరి హోటల్ లో బాలయ్య ఉన్నట్లు టాక్. దీనితో హీరో బాలయ్య మోడరేట్ హోటల్ లో ఉండటంతో ఈ మూవీకి సంబంధించిన దర్శకుడు రవికుమార్ ఇతర కీలక నటీనటులు కూడా బాలయ్య బస చేసిన హోటల్ లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. 

వాస్తవానికి అవుట్ డోర్ షూటింగ్ లకు వెళ్ళినప్పుడు పెద్దగా ఇమేజ్ లేని హీరోలు హీరోయిన్స్ కూడ కనీసం తమకు త్రీ స్టార్ హోటల్స్ కావాలని కండిషన్స్ పెడుతున్నారు. అయితే దీనికి భిన్నంగా బాలయ్య తాను చిన్న హోటల్ లో ఉండటమే కాకుండా విమాన ప్రయాణాలకు సంబంధించి బిజినెస్ క్లాస్ కాకుండా ఎకానమీ క్లాస్ లో ప్రయాణం చేస్తాను అని చెపుతున్న పరిస్థితులలో బాలయ్య పొదుపు చర్యలు చూసి ఈ మూవీ యూనిట్ సభ్యులు ఆశ్చర్య పడుతున్నట్లు టాక్. 

ఈ మూవీ నిర్మాత సి.కళ్యాణ్ కు బాలకృష్ణ ఈ మూవీని తక్కువ బడ్జెట్ తో పూర్తి చేస్తాను అని మాట ఇచ్చిన నేపధ్యంలో ఈ నందమూరి సింహం ఇలా మారిపోయాడు అని అంటున్నారు. అంతేకాదు బోయపాటి తో బాలకృష్ణ తన మూవీ ప్రాజెక్ట్ కు అంగీకరించే ముందు ఈ సినిమాను కూడా 40 కోట్ల లోపు తీయాలని లేకుంటే తాను నటించను  అని కండిషన్స్ పెట్టినట్లు సమాచారం దీనితో మారిపోయిన బాలకృష్ణ పొదపు చర్యలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: