టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికపుడు తన సినిమా సంగతులు మరియు ఫ్యామిలీ విషయాలతో పాటు, తీరిక సమయాల్లో ఇతర హీరోల సినిమాలను వీక్షించి వాటిపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇకపోతే నాలుగు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమా పై సూపర్ స్టార్ నేడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందించారు. వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి గద్దలకొండ గణేష్ అనే పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటించగా ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

మాస్ సినిమాలకు తెరకెక్కించే హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలిరోజు తొలిఆట నుండి విపరీతమైన ప్రేక్షకాభిమానంతో ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్, సాధారణ ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ మహేష్ వంటి కొందరు సినిమా సెలబ్రిటీలు సైతం స్పందించడం విశేషం. ఇక మహేష్ బాబు తన ట్వీట్ ద్వారా ఈ విధంగా స్పందించారు. 'నేడు గద్దలకొండ గణేష్ సినిమా చూసాను, సినిమా ఆద్యంతం కూడా నేను ఎంతో ఎంజాయ్ చేసాను, దర్శకులు హరీష్ సినిమాను ఎంతో బాగా తెరకెక్కించారు, అలానే నిర్మాతలు మంచి నిర్మాణాత్మక విలువలతో సినిమాను నిర్మించడం జరిగిందని అన్నారు. 

ఇక హీరో వరుణ్ తేజ్ అయితే ఆ పాత్రలో సూపర్ గా ఇరగదీశారని మహేష్ బాబు ఎమోజిల ద్వారా తెలిపారు. మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా యూనిట్ కి తన తరపున అభినందనలు' తెలిచేస్తున్నట్లు పోస్ట్ చేసారు మన సూపర్ స్టార్. ఇక మహేష్ బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ గొప్పతనాన్ని మెచ్చుకుంటూ మెగాఫ్యాన్స్ ఆయనకు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: