ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనే చేయాలంటారు. షష్టిపూర్తి వయసులో గుర్రమెక్కి.. యుద్దాలు చేశాడు ఓ బాలీవుడ్ హీరో. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేయగా.. అందులో సీనియర్ హీరో పరిస్థితి ఎలా ఉందో తెలుసా..?  


బాజీరావ్ మస్తానీ.. పద్మావతి తర్వాత హిందీలో రూపొందుతున్న మరో పీరియాడిక్ మూవీ పానిపట్. భారీ చిత్రాల దర్శకుడు అశుతోష్ గోవారికర్ డైరెక్షన్ లో రూపొందుతోంది. 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మరాఠా యోధుడు సదాశిరాన్ భావ్ గా అర్జున్ కపూర్, ఆమె భార్య పార్వతీ భాయ్ గా కృతిసనన్.. ఆఫ్ఘనిస్థాన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలిగా సంజయ్ దత్ నటించారు. 


పానిపట్ ను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. నా జన్మభూమికి చెందిన ధూళికణం కోసం చనిపోవడానికైనా సిద్దమేనన్న మరాఠా యోధుడు డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. సంజయ్ దత్ డైలాగ్స్ బాగున్నా.. యాక్షన్ సీన్స్ ను వయసు డామినేట్ చేసింది. 


సంజయ్ దత్ 60ఏళ్ల వయసులో పానిపట్ సినిమా చేశాడు. వయసు కవర్ చేసేందుకు డైలాగ్స్ అన్నీ క్లోజప్ షాట్స్ లో పెట్టి.. యాక్షన్ సీన్స్ అన్నీ లాంగ్ షాట్స్ తో చిత్రీకరించాడు దర్శకుడు. గుర్రపు స్వారీ.. ఛేజింగ్ యాక్షన్ సీన్స్ ఈ వయసులో చేయలేకపోవడం కారణంగా.. డూప్ తో, గ్రాఫిక్స్ తో కవర్ చేశారు. 


మొత్తానికి సంజయ్ దత్ వయసుతో నిమిత్తం లేకుండా సినిమాల్లో నటించేస్తున్నారు. ఏజ్ సహకరించకున్నా సాహసాలు చేసేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం సంజయ్ సినిమా కోసం డిసెంబర్ 6 ఎప్పుడొస్తుందా అని వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా తన అభిమాన హీరో మూవీ ప్రేక్షక లోకాన్ని మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి పానిపట్ ఎలా ఉంటుందో..! 



మరింత సమాచారం తెలుసుకోండి: