కథలో అంతర్లీనంగా దాగి ఉన్న కథనాన్ని పరోక్షంగా చెప్పెది టైటిల్ అందుకే చిత్రయూనిట్ సినిమా సబ్జెక్ట్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో టైటిల్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటారు. అలా సినిమా టైటిల్ విషయంలో ప్రజెంట్ ఓ డిఫరెంట్ ట్రెండ్ నడుస్తుంది. ఆ నయా ట్రెండ్ ఏంటో తెలుసుకుందాం. ఎక్కువగా టైటిల్స్‌గా మారుతున్న లిరిక్స్ స్టార్ హీరోల సినిమానుంచే వస్తున్నాయి. హీరోల స్టార్ డమ్‌తో సినిమాతో పాటు ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆ పాటలు టైటిల్స్‌గా కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా పవన్ లేటెస్ట్ మూవీ అత్తారింటికి దారేది సినిమాలో ని పాట కూడా టైటిల్‌గా రిజిస్టర్ అయింది. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన కాటమ్రాయుడా పాటను చాంబర్లో టైటిల్‌గా రిజిస్టర్ చేశారు. అత్తారింటికి దారేది సినిమాలోనే సూపర్ సక్సెస్ అయిన మరో పాట వీడు ఆరడుగుల బుల్లెట్టు. పవన్ పవర్‌ని ఓ రేంజ్లో ఎలివేట్ చేసిన ఈ పాట సినిమా ఫస్ట్‌లుక్‌గా రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆరడుగుల బుల్లెట్టు అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు నిర్మాతలు.
పవర్ స్టార్ మరో బిగ్గేస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ గబ్బర్ సింగ్. ఈ సినిమా లోని పాటనను ఆధారం చేసుకొని రూపొందించిందే గుండేజారి గల్లంతయ్యిందే సినిమా. గబ్బర్ సింగ్ చిత్రంలోని మరో సాంగ్ కెవ్వుకేక.ఈ సాంగ్ నే టైటిల్ గా చేసుకొని అల్లరి నరేష్, షర్మిలా మాండ్రే జంటగా, కామెడీ ఎంటర్ టైనర్ గా కెవ్వు కేకా చిత్రాన్ని రూపొందించారు. మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సూపర్ హిట్ మూవీ ఒక్కడు. ఈ చిత్రం లోని సాహసం శ్వాసగా సాగిపో సోదరా అంటూ సాగే పాటలోని, సాహసం టైటిల్ ను ఆధారంగా గోపిచంద్, తాప్సి జంటగా సాహసం చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలోని మరో సూపర్ సాంగ్ చెప్పవే చిరుగాలి. ఈ సాంగ్ ను టైటిల్ గా చేసుకొని వేణు, అభిరామి ప్రధాన పాత్రలో చెప్పవే చిరుగాలి చిత్రాన్ని రూపొందించారు.. ప్రిన్స్ మహేష్ బాబు మరో బ్లాక్ బాస్టర్ మూవీ బిజినెస్ మాన్ చిత్రంలోని సారొస్తారొస్తారా సాంగ్ ను టైటిల్ గా చేసుకొని, రవితేజ , కాజల్ , రిచాగంగోపాద్యాయ ప్రదాన పాత్రలు గా సారొచ్చారు చిత్రాన్ని రూపొందించారు.
ప్రభాస్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం వర్షం చిత్రంలోని నువ్వస్తానంటే నేనొద్దాంటాన సాంగ్ నే టైటిల్ గా చేసుకొని, సిద్దార్థ్, త్రిష హీరోహీరోయిన్లుగా ప్రభు దేవా తన దర్శకత్వంలో నువ్వస్తానంటే నేనొద్దాంటాన చిత్రాన్ని రూపొందించారు. అర్జన్, మనీషకోయిరాల హీరో హీరోయిన్లు గా.. ఒక రోజు ముఖ్యమంత్రి కథాశంతో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక్కడు. ఈ చిత్రంలోని మగధీర సాంగ్ ను టైటిల్ గా చేసుకొని రాంచరణ్, కాజల్ జంటగా… గత జన్మ ప్రేమ కథ ను ఇతివృత్తంగా మగధీర చిత్రాన్ని రూపొందించాడు రాజమౌళి. ఈ సినిమా కూడా భారీ హిట్ నే సొంతం చేసుకుంది. గత సినిమాలోని సాంగ్స్ ను ఆధారం చెసుకొని టైటిల్ రూపొందించడం చాలా కాలం క్రితం నుండి కొనసాగుతుంది. సినీ మన్మథుడిగా పేరుగాంచిన నాగార్జున, అంజలా జావేరీ జంటగా నటించిన చిత్రం రావోయిచందమామ టైటిల్ ని, అలనాటి ఆణిముత్యం మిస్సమ్మా సినిమాలొని రావోయి చందమామ మా ఇంటి గాద వినుమా… అనే పాట లోనిది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి