టాలీవుడ్ హీరో రాజశేఖర్ కు తెలంగాణ ప్రభుత్వ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్టీఏ అధికారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖరాసినట్టు సమాచారం. రాజశేఖర్ ట్రాఫిక్ చట్టాలను పదే పదే ఉల్లంఘించడమే ఈ చర్యలకు మూల కారణంగా తెలుస్తోంది.
రాజశేఖర్ గతంలోనూ రెండు సార్లు ట్రాఫిక్ చట్టాలని ఉల్లంఘించారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఆయన డ్రైవింగ్ లోనే గతంలోనూ రెండు సార్లు ప్రమాదాలు జరగడంతో ఈసారి కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్టీఏ అధికారులు కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురైంది. పెద్ద గోల్కొండ సమీపంలో అదుపు తప్పిన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
ఒక విధంగా హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్ కారు బోల్తా పడింది. శంషాబాద్ దగ్గరలోని పెద్ద గోల్కండ దగ్గర అదుపు తప్పిన కారు బోల్తా పడింది. రాజశేఖర్ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
టీఎస్ 07 ఎఫ్‌జెడ్ 1234 నెంబరు కలిగిన లగ్జరీ కారు ప్రమాదంలో నుజ్జు నుజ్జైంది. అయితే కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవటంతో హీరో రాజశేఖర్ కు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తరువాత మరో కారులో రాజశేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన కారు నెంబర్ తో పలు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉండటంతో ఈసారి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ ఆర్టీఏ అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తే మిగిలిన వారికి కూడా ఓ హెచ్చరికగా మిగిలే ఛాన్స్ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి