సుడిగాలి సుదీర్... జబర్దస్త్ లో  ఒక సాదా సీదా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చినా సుధీర్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జబర్దస్త్ టీం లీడర్ గా మారిపోయాడు. ఇక ఆ తర్వాత తన సత్తా చాటుకున్న సుదీర్  ఒక రేంజ్ లో ఫేమస్ అయిపోయారు సుడిగాలి సుదీర్ జబర్దస్త్ లోకి వచ్చిన కమెడియన్స్ అందరిలో  ఎక్కువ పాపులారిటీ సంపాదించిన కమెడియన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు. ఎందుకంటే సుడిగాలి సుధీర్ కేవలం కామెడీతోనే కాదు తన డాన్స్ తో మ్యాజిక్ తో మాటలతో అందరిని అలరించే వాడు. ఇక  సుడిగాలి సుధీర్ స్కిట్ వస్తుందంటే ప్రేక్షకులు టీవీ కి అతుక్కుపొయేవారు.  ఎందుకంటే సుడిగాలి సుదీర్ స్కిట్ లో ఆటో పంచులు అంతగా ఉంటాయి మరి. ప్రేక్షకులను అంతగా కడుపుబ్బ నవ్విస్తాయి మరి.

 

 

 

 అయితే సుధీర్ కేవలం జబర్దస్త్ లోనే కాదండోయ్  మిగతా ఛానల్ లో కూడా యాంకర్గా మెప్పిస్తూ తనదైన స్టైల్ లో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయాడు జబర్దస్త్ సుడిగాలి సుదీర్. ప్రస్తుతం సాఫ్ట్వేర్ సుదీర్ అనే సినిమాతో పాటు త్రీ మంకీస్ అనే సినిమాలో నటించాడు సుడిగాలి సుధీర్. సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల కానున్నది. కాగా  ఈ సినిమాకి సంబంధించిన పాటలు సినీ ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ని సంపాదించుకుంది. ఈ పాటలో సుడిగాలి సుదీర్ కు సంబంధించి డాన్స్  కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మామూలుగానే సుడిగాలి సుదీర్ అంటే డాన్సులు ఇరగదీస్తాడు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాలో తన టాలెంటు మొత్తం నిరూపించుకున్నాడు సుడిగాలి సుదీర్. 

 

 

 ప్రస్తుతం సుడిగాలి సుదీర్ నటించిన సాఫ్ట్వేర్ సుదీర్ ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా సుధీర్ తన జీవితంలోని అనేక కోణాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.అయితే ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం కి కూడా హాజరయ్యారు సుడిగాలి సుదీర్. అయితే ఈ షోలో రష్మీ గురించి సుడిగాలి సుదీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయిఅయితే ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీ సుడిగాలి సుధీర్ కి ఓ ప్రశ్న వేశాడు. ఓవైపు దీపికా పడుకునే మరోవైపు కరీనాకపూర్ ఉంటే ఎవరిని హాగ్ చేసుకుంటావ్ అంటూ  సుడిగాలి సుదీర్ ఓ ప్రశ్న అడిగాడు. అయితే దీనిపై స్పందించిన సుడిగాలి సుదీర్ ఈ ఆప్షన్ లో రష్మీ ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సుడిగాలి సుదీర్ వ్యాఖ్యలపై రష్మీ మాత్రం ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. పబ్లిసిటీ స్టంట్ కోసం సినిమా ప్రమోషన్స్ కోసం అలా మాట్లాడటం సబబు కాదంటూ రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: