ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెరపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అంటే బుల్లి తెర ప్రేక్షకుల హీరో, హీరోయిన్. ఏ షోలోనైనా సుధీర్ ఉంటే రష్మీ ఎక్కడ అని, రష్మీ ఉంటే సుధీర్ ఎక్కడ అని అడిగేవారు చాలా మందే ఉన్నారు. అయితే సుడిగాలి సుధీర్ అనేవాడు ఇప్పుడు కేవలం జ‌బ‌ర్ద‌స్త్ కమెడియన్ మాత్రమే కాదు.. స్టార్ కూడా అయిపోయాడు. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని పిచ్చ క్రేజ్ పెంచుకున్నాడు. కేవ‌లం కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా యాంక‌ర్, మెజీషియ‌న్ ఇలా చాలా చేస్తున్నాడు సుధీర్. అలాగే సుడిగాలి సుధీర్ అంటే చాలు పిచ్చెక్కిపోయే అమ్మాయిలు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. 

 

ఇక తాజాగా ఈయన హీరోగా కూడా వస్తున్నాడు. ఎన్నో ఎంటర్ టైన్ మెంట్, టీవీ షోలలో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్ సుధీర్'. ఈ సినిమాలో సుధీర్ సరసన లవ్ ఫెయిల్యూర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ధన్య బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా తెలుగు ప్రజలముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.  అయితే సుడిగాలి సుధీర్ ను చూసి ఇన్‌స్పిరేషన్ పొందిన కొందరు యాంకర్స్ అతడిని ఫాలో అవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు కానీ వర్కౌట్ కాలేదు. 

 

ఇక‌ తాజాగా.. సుడిగాలి సుధీర్‌ను యాంకర్ రవి గుడ్డిగా ఫాలో అయిపోతున్నాడని సోషల్ మీడియా వేదికగా సుధీర్ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొద‌లు పెట్టారు. ముఖ్యంగా యాంకర్ రవి కొత్త ప్రోగ్రాం లోకల్ గ్యాంగ్స్ లో సుధీర్ ను ఇమిటేట్ చేసే సుధీర్‌కు చెక్ పెట్టాల‌ని చూశాడు. అయితే అతడికి ఏమాత్రం సెట్ కాలేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరి బాడీ లాంగ్వేజ్ కి ఏ కేరక్టర్ సెట్ అవుతుందో అది చేస్తేనే బాగుంటుందనే సూచనలు కూడా ఇస్తున్నారు. . బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న వారిలో ర‌వి కూడా ఒక‌డు. కానీ.. ఇప్పుడు అలాంటి ర‌వి ఇప్పుడు సుధీర్ ఫాలో అవ్వ‌డంతో ట్రోలింగ్‌కు గుర‌వుతున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: