ప్రస్తుతం మహేష్ తాను నటించిన ‘1’ నేను ఒక్కడినే సినిమాతో బాటు త్వరలో రాబోతున్న ఎన్ని కల గురించి టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆడుతున్న మాస్టర్ మైండ్ గేమ్ మహేష్ కు దడ పుట్టిస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం మహేష్ బావ గల్లాజయదేవ్ అని అంటున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం గుంటూరు పార్లమెంటు స్థానం నుండి గల్లాజయదేవ్ ను పార్టీ అభ్యర్ధిగా నిలపాలని చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడమే కాకుండా, తెనాలి అసెంబ్లీ స్థానం నుండి మహేష్ బాబాయి ఆది శేషగిరి రావ్ ను ఎంపిక చేస్తారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పటి దాక రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటున్న మహేష్ తన సొంత మనుషుల విజయం కోసం ప్రచారంలోకి రమ్మని ఒత్తిడి వస్తే తన పరిస్థితి ఏమిటీ అని మదన పడుతున్నాడట.
ఇప్పటికే మహేష్ తన ట్విటర్ లో అనుసరించే ఏకైక వ్యక్తిగా రికార్డు కెక్కిన గల్లా జయదేవ్ ప్రచారం కోసమైనా మహేష్ రాజకీయ సభలకు వస్తాడా లేకుంటే తెలివిగా తప్పించు కుంటాడ అనే ఆశక్తికర కధనాలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఎదిఎమైనా చాలామంది తో పాటు వచ్చే సంవత్సరం మహేష్ కు అటు సినిమాల రీత్యా ఇటు రాజకీయాల రీత్యా టెస్టింగ్ టైమ్ అనుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి