రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలోనే కాకుండా తన అభిమానులలో కూడ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవాన్ని ఏర్పరుచుకున్న కృష్ణంరాజు గురించి ఆయన భార్య శ్యామల ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసారు. అంతేకాదు కృష్ణమరాజుకు ప్రభాస్ కు ఉన్న సాన్నిహిత్యం గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.
ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజును ‘పెద్ద బాజీ’ అని పిలుస్తాడు అనీ తనను ‘కన్నమ్మా’ అని ప్రేమతో పిలుస్తాడనీ ప్రభాస్ సెల్ లో కూడ తమ ఫోన్ నెంబర్లు ఈ పేర్లతోనే ఫీడ్ అయి ఉంటాయి అంటూ ఎవరికీ తెలియని విషయాన్ని ఆమె బయట పెట్టింది. అంతేకాదు ప్రభాస్ కు కృష్ణంరాజు అంటే విపరీతమైన ప్రేమ అని చెపుతూ మరొక ఆసక్తికర విషయాన్ని ఆమె షేర్ చేసింది.
‘ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఇప్పుడు మీరు సుఖపడాలి మిమ్మలను హ్యాపీగా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా’ అంటూ ప్రభాస్ తన పెదనాన్నతో ఎన్నో సార్లు చెప్పినా కృష్ణంరాజు రిటైర్ మెంట్ అన్న పదాన్ని అంగీకరించడనీ ఇంకా సినిమాలు తీయాలి నిర్మించాలి అన్న తపనతో నిరంతరం కృష్ణంరాజు ఆలోచిస్తాడు అన్న విషయాన్ని శ్యామల షేర్ చేసింది. అంతేకాదు ప్రభాస్ దృష్టిలో కృష్ణంరాజు ఒక సుప్రీమ్ అని చెపుతూ ఆయన ఒక మాట చెపితే ఆమాటను తిరస్కరించే సాహసం ప్రభాస్ చేయలేడు అంటూ ఆమె అభిప్రాయపడింది.
ఇక తమకు ముగ్గురు కూతుళ్ళు అన్న విషయాన్ని తెలియచేస్తూ ప్రభాస్ తన చెల్లెళ్ళతో చాల ప్రేమగా ఉండటమే కాకుండా నిరంతరం తన చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తూ వారి యోగ క్షేమాలు అను నిత్యం కనుక్కుంటూ ఉంటాడు అన్న విషయాన్ని ఆమె బయట పెట్టింది. తాను ముగ్గురు పిల్లలను పెంచడంలో ఎప్పుడు కష్టపడకపోయినా తనకు భర్త అయిన కృష్ణంరాజును పెంచడమే చాల కష్టంగా మారింది అంటూ జోక్ చేయడమే కాకుండా కృష్ణంరాజును వదిలి తాను తన పుట్టింటికి కూడ వెళ్ళలేని పరిస్థితి అని అంటూ కృష్ణంరాజులోని పసిపిల్లవాడి మనస్తత్వాన్ని బయటపెట్టింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి