కళాత్మకంగా సినిమాలు తీయడం అది కొంత మందికే సాధ్యపడుతుంది డైరక్టర్ అంటే తనని అభిమానిస్తున్న ఫ్యాన్స్ నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయకుండా.. వారి అంచనాలను అందుకుంటున్నాడు. మంచుపల్లకి సినిమా తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం రాబోతున్న ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమా వరకు ఎంతో సహజత్వంగా ఉంటుంది. కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న వంశీ మరళ ఒక మంచి సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ‘తను మొన్నే వెళ్లిపోయింది’ సినిమాతో వస్తున్న వంశీ కొద్దిరోజులుగా ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కుంది.. ఇప్పుడు అన్నీ ప్రాబ్లెంస్ ని క్రాస్ చేసి ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నెలలో ఆడియో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.. సినిమాని కూడా నెక్ష్ట్ మంత్ లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో అజ్మల్ అమీర్, నికితా నారాయణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చక్రి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి వంశీ నే దగ్గరుండి 200 పైగా పోస్టర్స్ ని డిజైన్ చేయించాడు.. తను మొన్నే వెళ్లిపోయింది కచ్చితంగా ప్రేక్షకాదరణ పొంతుందని దర్శక,నిర్మాతల నమ్మకం. శ్రీ యస్ చిత్ర బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను పూర్ణ నాయుడు నిర్మిస్తున్నారు. రంగం సినిమాతో అలరించిన అజ్మల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు..ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన నికితా నారాయణ్ హీరోయిన్ గా చేస్తుంది. మరి సాధారణంగా వంశీ సినిమాలో హీరోయిన్ అంటే కొన్ని స్పెషల్ మేనరిజంస్ తో సూపర్ క్రేజ్ ని కొట్టేస్తారు. మరి ఈ సినిమాతో నికితా కూడా మంచి పేరు తెచ్చుకోవచ్చు అంతేకాదు తను మొన్నే వెళ్లిపోయింది సినిమా రిజల్ట్ వంశీకి కూడా చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: