ఏమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై కొన్నేళ్ల క్రితం డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన శేఖర్ కమ్ముల, ఆ తరువాత రాజా, కమలిని ముఖర్జీల కలయికలో ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అనే మంచి క్లాస్ ఎంటర్టైనర్ ని తీసి హిట్ కొట్టాడు. ఆ తరువాత సుమంత్ తో గోదావరి తీసి పర్వాలేదనిపించిన శేఖర్, అనంతరం నలుగురు యువతీ యువకుల కథతో హ్యాపీ డేస్ అనే సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత రానా తో తీసిన లీడర్ సినిమాతో పర్వాలేదనిపించిన శేఖర్, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూశాడు. 

 

ఇక ఇటీవల వరుణ్ తేజ్, సాయి పల్లవి ల కలయికలో ఫిదా అనే లవ్ స్టోరీని తెరకెక్కించి మరొక సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవిల కలయికలో లవ్ స్టోరీ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఫిదా మాదిరిగా మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, కథనాలు యూత్ ని బాగా ఆకట్టుకుంటాయని సమాచారం. ఇకపోతే తన సినిమాలకు ఎప్పటికప్పుడు ఎక్కువగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకునే అలవాటున్న శేఖర్ కమ్ముల, 

 

లవ్ స్టోరీ సినిమాకు కూడా సి హెచ్ పవన్ అనే కొత్త సంగీత దర్శకుడిని తీసుకుంటున్నాడు. గతంలో ఆనంద్, గోదావరి సినిమాలకు కెఎం రాధాకృష్ణన్ అనే యువ సంగీత దర్శకుడితో పని చేసిన కమ్ముల, అనంతరం తీసిన హ్యాపీ డేస్ ద్వారా మిక్కీ జె మేయర్ ని, అలానే మొన్నటి ఫిదా సినిమా ద్వారా శక్తి కాంత్ అనే సంగీత దర్శకుడిని పరిచయం చేసి అందరి నుంచి చక్కటి సంగీతం రాబట్టుకున్నాడనే చెప్పాలి. మరి ప్రస్తుతం లవ్ స్టోరీ ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా అడుగుపెడుతున్న పవన్, ఎంత మేర మంచి సాంగ్స్ అందించి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.....!!      

మరింత సమాచారం తెలుసుకోండి: