బహుభాషా నటుడిగా విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్‌ హంక్‌ రానా వ్యాపార రంగంలోనూ దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన కంచరపాలెం సినిమాను నిర్మించిన రానా, తాజాగా మరో డిఫరెంట్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాకు కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌ను ఫిక్ప్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ను సీనియర్‌ హీరో, రానా బాబాయి విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

 

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గుంటూర్ టాకీస్' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నాడు. క్షణం తో డైరెక్టర్ గా పరిచయమై సంచలనం సృష్టించిన రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు. వాలంటైన్స్ డే సందర్భంగా కృష్ణ అండ్ హిజ్ లీల టీజర్ ను హీరో విక్టరీ వెంకటేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఒక కాంటెపరరీ కాన్సెప్ట్‌తో టీజర్‌ను ఇంట్రస్టింగ్‌ గా రూపొందించారు. క్షణం తో పోలిస్తే తన రెండో సినిమాను ఒక డిఫరెంట్ స్టోరీతో రవికాంత్ రూపొందిస్తున్నాడు.

 

సరికొత్త కథనంతో మ్యాజిక్ చెయ్యడం ఆయన బలం. సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను తయారు చేశాడు రవికాంత్. రాంగ్ టైమ్ రిలేషన్ షిప్స్ తో సమస్యల్లో చిక్కుకొనే యువకుడిగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో అతను సరసాల్లో మునిగి తేలుతుంటాడు. హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటిస్తున్నారు.

 

శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ కు తగ్గట్టుగా పులిహోర కలిపెనులే అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే సూపర్బ్‌ కామెడీ పండించాడు. ఈ పులిహోర ట్రాక్ ను హేమచంద్ర స్వయంగా రాసి పాడాడు. మే 1న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ, త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామనీ చిత్ర బృందం వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: