అక్కినేని మరణ వార్త తెల్లవార కుండానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులకు దావాలనంగా వ్యాపించింది. నిన్న ఉదయం నుండి మన రాష్ట్రంలోని ప్రముఖ ఛానల్స్, పత్రికలు, వెబ్ మీడియా ఈ వార్తను ప్రధానంగా చూపెట్టడమే కాకుండా అక్కినేని జీవితానికి సంబంధించిన అన్ని విషయాల పైనా నిన్న ఉదయం నుండి వార్తలు, కధనాలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి.  అయితే భారతదేసంలోనే ప్రముఖ స్థానాన్ని నటుడిగా అందుకున్న అక్కినేని మారణ వార్తను నేషనల్ మీడియా సరిగా ప్రసారం చేయకపోవడం పై చాలామంది మన టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిగా ఉన్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన ట్విటర్ లో ప్రస్తావించడమే కాకుండా మన దక్షిణాది తారల పట్ల జాతీయ మీడియా చూపెడుతున్న పక్షపాత విధానంగా కొరటాల శివ తన ట్విటర్ లో తీవ్ర విమర్శలు చేసారు.  అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జాతీయ మీడియా పట్టించుకోని అక్కినేని మరణ వార్త బి.బి.సి. ఛానల్ లో ప్రసారం కావడం అక్కినేని విశ్వవ్యాప్త కీర్తికి దర్పణంగా ఉందని అక్కినేని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: