మెగా స్టార్ చిరంజీవికి లక్షలాది మంది అభిమానులు ఉండటమే కాకుండా ఆయన రాజకీయాలలో ఉన్నా సినిమాలలో కొనసాగుతున్నా జయాపజయాలతో సంబంధం లేకుండా గౌరవం పొందే వ్యక్తిత్వం చిరంజీవి సొంతం. అతి సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం పై ఇప్పటికే అనేక పుస్తకాలు వచ్చాయి. 


ఇప్పుడు లేటెస్ట్ గా ‘మెగాస్టార్‌ ది లెజెండ్‌’ పేరుతో సీనియర్‌ జర్నలిస్టు వినాయకరావు ఒక పుస్తకం వ్రాశారు. ఈమధ్యనే పుస్తక ఆవిష్కరణ జరుపుకున్న ఈ పుస్తకంలో అనేక ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అత్యంత ధైర్య సాహసాలు గల చిరంజీవికి చెన్నై లోని  పాండీ బజార్ అంటే విపరీతమైన భయం అట. 


అందుకే ఇప్పటికీ తాను ఆ ఏరియాకు తనకు మెగా స్టార్ హోదా వచ్చినప్పటికీ వెళ్ళడానికి భయపడిపోతాను ఈ పుస్తక రచయితకు చిరంజీవి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసాడు. ఈ సందర్భంగా ఒక కప్పల కథను గుర్తుకు చేసుకుంటూ ఒక కప్ప పైకి ఎక్కుతుంటే మిగతా కప్పలు వాటినీ నిరుత్సాహ పరుస్తూ కిందకు లాగే విధంగా పాండీ బజార్ లో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన వారు చాల నిరాశతో ఉంటూ ఎదుటి వారిని కూడ నిరాశపరిచే విషయం తన జీవితంలో కూడ జరిగింది అంటూ అప్పటి విషయాలను చిరంజీవి గుర్తుకు చేసుకున్నాడు. 


తాను మద్రాసులో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఒకసారి తన మిత్రుడుతో పాండి బజార్ వెళ్ళినప్పుడు తనకు ఎదురైన వింత అనుభవాన్ని చిరంజీవి బయట పెట్టాడు. తాను సినిమా యాక్టర్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అన్న విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి చిరంజీవి వైపు చూస్తూ ‘నువ్వు యాక్టర్ అవుతావా ? ఫేస్ ఎపుడైనా చూసుకున్నావా’ అంటూ  అనరాని మాటలు అన్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ క్షణంలో తన పై తనకే నమ్మకం పోయిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఇప్పటికీ తనకు పాండీ బజార్ అన్నా అక్కడ ఉండే మనుషులు అన్నా భయం అంటూ అందుకే తాను చెన్నైలో ఉన్నప్పుడు తన కారులో కూడ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి భయపడిపోయే వాడిని అంటూ చిరంజీవి బయటపెట్టిన అలనాటి విషయాలను చదివిన వారికి చిరంజీవి మెగా స్టార్ గా ఎదగడానికి ఎంత కష్టపడ్డాడో అర్ధం అవుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: