పాపం టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్ పరిస్థితి గందరగోళంగా ఉంది. మొన్నటికి మొన్న దిల్ రాజు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఆశలన్ని బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయి. అయినా మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కుర్ర హీరో దర్శకుడు కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా కోసం మైబైల్ వాహనాలతో పబ్లిసిటీ ప్లాన్ చేసారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్న వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో తిరుగుతాయట. వీటిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కుర్ర హీరో సినిమాకి ఇదో రకమైన పబ్లిసిటీ. మరి ఇది ఎంతవరకూ కలిసి వస్తుందో చూడాలి.

 

ఇక ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ..'ఒరేయ్ బుజ్జిగా' ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని... ఈ కొత్త పబ్లసిటీ కాన్సెప్ట్ కూడా బాగుందని... తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువ జనసందోహం ఉంటుందో  అక్కడ వాహ‌నాల ద్వారా ఈ పబ్లిసిటి చేయాలనే ఐడియా ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది అని వెల్లడించారు.

 

అంతేకాదు రాజ్ తరుణ్ ని 'ఉయ్యాలా జంపాల' సినిమా నుండి ప్రేక్షకులు బాగా ఆద‌రిస్తున్నారు. హీరోయిన్ మాళవిక నాయర్ తో పాటు టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకి మంచి డబ్బులు రావాలి. అలాగే భవిష్యత్ లో కూడా ఇంకా మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను అంటూ చిత్ర బృదానికి శుభాకాంక్షలు తెలిపారు. అన్నారు. 

 

ఈ వాహనాల లాంచింగ్ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్, నిర్మాత రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఒరేయ్ బుజ్జిగా సినిమా ఈ నెల 25న విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఇదే పబ్లిసిటీనా లేక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి చేస్తారా అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. ఎప్పుడో కుమారి 21 ఎఫ్ సూపర్ హిట్ అయింది. మళ్ళీ రాజ్ తరుణ్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. ఆ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమా రేంజ్ హిట్ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. మరి ఈ సినిమా అయినా కలిసి వస్తుందా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: