3 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధమవుతోంది. మొదటి సీజన్ ఎన్టీఆర్, సెకండ్ సీజన్ నాని, థర్డ్ సీజన్ నాగార్జున మూడు సీజన్లు ముగ్గురు స్టార్స్ హోస్ట్ గా చేశారు. అయితే నాలుగో సీజన్ ఎవరు హోస్ట్ గా చేస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సీజన్ సూపర్ స్టార్ మహేష్ ను హోస్ట్ గా చేయించాలనే ప్లాన్ చేస్తున్నారు. మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసినప్పుడు భారీగా టీఆర్పీ తెచ్చుకుంది. ఆ తర్వాత రెండు సీజన్ లు ఆశించిన స్థాయిలో టిఆర్పి రేటింగ్ తెచ్చుకోలేదు.

 

అందుకే నాల్గవ సీజన్ కు మహేష్ కు హోస్ట్ గా చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే మహేష్ ఓకే అంటే సీజన్ 4కు భారీ క్రేజ్ వచ్చేసినట్టే. ఇక మహేష్ కాకుంటే మాత్రం మళ్ళీ కింగ్ నాగార్జునని హోస్ట్ గా చేయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. నాగార్జున ఆల్రెడీ లాస్ట్ సీజన్ హోస్ట్ గా చేశారు. మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా చేసిన నాగ్ బిగ్ బాస్ సీజన్ 3ని బాగానే హ్యాండిల్ చేశారు. ఇక సీజన్ 4కి ఆయన్ను కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. 

 

బిగ్ బాస్ సీజన్ 4 ఈ ఇయర్ జూలైలో మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సీజన్ 4 మహేష్ లేదా నాగార్జున ఈ ఇద్దరిలో ఒకరు హోస్ట్ గా చేస్తారని తెలుస్తుంది. ఎన్టీఆర్,నాని, నాగార్జున ముగ్గురు మూడు హోస్ట్ సూపర్ సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు మహేష్ కూడా హోస్ట్ గా చేస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో చూడాలని ఆశిస్తున్నారు బుల్లితెర ఆడియెన్స్.

 

బిగ్ బాస్ సీజన్ 1 కన్నా సీజన్ 2 దాని కన్నా సీజన్ 3 ఇలా సీజన్ సీజన్ కు ఆ షో మీద ఆసక్తి తగ్గుతుందని అంటున్నారు. అందుకే ఈసారి షోలో టాస్కులు కూడా చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. బాలీవుడ్ లో 12 సీజన్లు దాకా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సౌత్ లో యావరేజ్ షోగానే నడుస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: