ఇప్పటికే కరోనా దెబ్బకి చాలావరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అన్ని కూడా లాకౌట్ అయిన విషయం తెలిసిందే. ఎక్కడి ప్రజలను అక్కడే పూర్తిగా ఇళ్లకు పరిమితం చేస్తేనే తప్ప ఈ మహమ్మారిని వేగంగా అంతం చేయగలమని బావంచిన పలు దేశాలు ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఇక మన దేశాన్ని కూడా ప్రధాని మోడీ మొత్తంగా 21 రోజలు లాకౌట్ ప్రకటించడంతో పేద, దిగువ తరగతుల వర్గాల వారికి అది పెను శాపంగా మారింది. ఎందరో పేదవారు తమ ఇళ్ళనుండి బయటకు రాలేక, చేయటానికి పని లేకపోవడంతో తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 

 

అయితే ఈ పరిస్థితిని గ్రహించిన కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలకు ఇప్పటికే ఉచిత రేషన్ తో పాటు కొంత మేర ఆర్ధిక సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఇటువంటి భయంకర విపత్తు సమయంలో అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవడం మా బాధ్యతని భావించి ఇప్పటికే పలు రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు ముందుకు రావడం, తమ శక్తి కొలది వీలైనంత మేర విరాళాల రూపంలో అందించడం జరిగింది. 

 

ఇక ఇటువంటి కష్ట సమయాల్లో ప్రజలకు ఎప్పుడూ తమ వంతుగా సాయం అందించడంలో ముందు ఉండే టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించగా, నేడు టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రూ.3 లక్షల ఆర్ధిక సాయాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన కరోనా విపత్తు నిధికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం మన అందరి బాధ్యత అని, ఆర్ధికంగా స్థోమత ఉన్న మిగతా వారు కూడా ముందుకు వచ్చి తమకు తోచినంత సాయం అందిస్తే బాగుంటుందని బ్రహ్మానందం కోరుతున్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న ప్రముఖులపై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు....!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: