నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వలన మన దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో, మిగతా నటుల వలే కొద్దిరోజులుగా తన కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో గీత గోవిందం దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి కథ, స్క్రిప్ట్ పూర్తి అయిన ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్రారంభించనున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా తరువాత మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నట్లు చెప్తున్నారు. 

 

మరోవైపు నిన్న టాలీవుడ్ దర్శకదిగ్గం ఎస్ ఎస్ రాజమౌళి, తన తదుపరి సినిమాని మహేష్ బాబు తో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అలానే తనకు శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే మహేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నారని, ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్న శివ, దాని అనంతరం మహేష్ తోనే చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీరితో పాటు ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ కు సూపర్ స్టోరీ లైన్ ఒకటి వినిపించారని, అది ఎంతో నచ్చిన మహేష్, దానిని పూర్తి స్క్రిప్ట్ గా సిద్ధం చేయండి అతి త్వరలో చేద్దాం అని చెప్పినట్లు సమాచారం. ఇక వీటన్నిటితో పాటు కొద్దిరోజుల క్రితం కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, సూపర్ స్టార్ ని ఒకానొక సందర్భంలో ఇంటికి  వెళ్లి కలిసి ఒక అద్భుతమైన కథను చెప్పారని, అయితే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కాగానే నిర్మాతను ఎంపిక చేసి సినిమా మొదలెడదాం అని మహేష్ చెప్పినట్లు ఇటీవల వార్తలు రావడం జరిగింది. 

 

వీటితో పాటు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ చేస్తున్న పూరి కూడా మహేష్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్నారని, అలానే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వయంగా కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహేష్ కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశాను, అయితే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో చెప్పలేనని అన్నారు. చిట్టచివరిగా మొన్న, గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, అతి త్వరలో చేయనున్న పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని, అలానే దానితో పాటు సూపర్ స్టార్ మహేష్ కోసం ఒక వండర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు హరీష్. ఇక ఈ విధంగా మొత్తంగా చూసుకుంటే రాబోయే ఐదేళ్లకు సరిపడా సూపర్ స్టార్ మహేష్ కోసం పనిచేయబోయే దర్శకులు ఆల్రెడీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నిజంగా మహేష్ బాబు ఆ సినిమాల లైనప్ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తోందని, ఊరికే సూపర్ స్టార్లు అవ్వరు కదా అంటూ పలువురు నెటిజన్లు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు......!!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: