రిలీజ్ కు 18రోజులు ఉందనగా.. లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో రామ్ సినిమా రెడ్ ఆగిపోయింది. అప్పటికే.. టీజర్.. ట్రైలర్.. ఓ లిరికల్ సాంగ్ తో పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. కరోనా పరిస్థితులు ఎప్పుడు సద్ధుమణుగుతాయో.. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కోలుకుంటుందో.. ఎప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్న రెడ్ టీమ్.. ఓ మేకింగ్ తో సందడి చేసింది. 


క్రైమ్..సస్పెన్స్.. హారర్.. ఎంటర్ టైన్ మెంట్. జానర్ ఏదైనా.. అందులో ప్రేమ ఉండాల్సిందే. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రెడ్ మూవీలో ఓ అందమైన ప్రేమ కథ ఉంది. దాన్ని పాటల రూపంలో ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ చేశారు. కరోనా తర్వాత ఇదే పాటకు సంబంధించి మేకింగ్ ను విడుదల చేశారు. 


కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం రెడ్. ఈ తమిళ రీమేక్ ను కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడు. నివేద పేతురాజ్.. మాళవిక శర్మ.. అమ్రిత అయ్యర్ హీరోయిన్స్. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ క్రెడిట్ లో మ్యూజిక్ కూడా వాటా ఉంది. మణిశర్మ ఇచ్చిన ట్యూన్స్.. సినిమాను మ్యూజికల్ హిట్ చేసింది. దీంతో రెడ్ కు కూడా మణిశర్మ కావాలని అడిగి మరీ పెట్టుకున్నాడు రామ్.


రెడ్ లో నువ్వే నువ్వే అంటూ సాగిన మెలోడీని ఫస్ట్ సాంగ్ గా రిలీజ్ చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా.. రమ్య బెహ్రా.. అనురాగ్ కులకర్ణి గానం చేశారు. రామ్, మాళవిక శర్మపై ఈ పాటను ఫారిన్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. ఛాయా గ్రాహకుడు సమీర్ రెడ్డి లొకేషన్స్ ను కెమెరాలోబంధించడంపై ఎక్కువ దృష్టిపెట్టాడు. మొత్తానికి ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి కొనసాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: