ఈనెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు రాబోతోంది. ప్రతి సంవత్సరం తన తండ్రి పుట్టినరోజునాడు మహేష్ తన కొత్త సినిమా ప్రారంభోత్సవం కానీ లేదంటే తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన టీజర్ ను కాని విడుదల చేయడం ఒక ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి ఈ నెలాఖరకు హైదరాబాద్ లో లాక్ డౌన్ ఎత్తివేస్తే మహేష్ పరుశు రామ్మూవీ ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిపించాలని మహేష్ భావించాడు. 


అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులలో హైదరాబాద్ లో ఈ లాక్ డౌన్ ఇంకా మరికొన్ని రోజులు కొనసాగే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో కృష్ణ పుట్టిన్నరోజునాడు ఊహించిన విధంగా మహేష్ పరుశు రామ్మూవీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఉండకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. 


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే మహేష్ రాజమౌళిల కాంబినేషన్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత రాజమౌళి దర్శకత్వం వహించబోయే మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న గోపాలరెడ్డి పై మహేష్ అభిమానుల నుండి ఒక ఊహించని ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి తాను ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత మహేష్ తో సినిమాను తీయబోతున్నాను అంటూ ఓపెన్ గా చెప్పిన పరిస్థితులలో ఈ నెలలో రాబోతున్న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజునాడు మహేష్ రాజమౌళిల మూవీ అధికారిక ప్రకటన విడుదల చేస్తే బాగుంటుంది అంటూ మహేష్ వీరాభిమానులు గోపాల రెడ్డి పై ఒత్తిడి చేస్తున్నట్లు టాక్.


వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా పడే ఆస్కారం ఉంది. దీనితో ఈమూవీ విడుదల తరువాత ఆ టెన్షన్స్ నుండి బయటకు బయటకు రావడానికి రాజమౌళికి కనీసం 6 నెలలు పట్టే ఆస్కారం ఉంది. దీనితో రాజమౌళి మహేష్మూవీ ప్రాజెక్ట్ కేవలం 2022లో మాత్రమే ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితులలో దాదాపు రెండు సంవత్సరాల తరువాత ప్రారంభం కాబోయే సినిమాకు ఇప్పుడు అధికారికంగా ప్రకటన ఇవ్వడం జరగని పని అయితే అలాంటి అద్భుతం జరిగితే బాగుండును అని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరిని నొప్పించని రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: