ఏపీ సీఎంపై పోరాటానికి చంద్రబాబు కొత్త అస్త్రాలు బయటకు తీశారు. అవే వైద్యుడు సుధాకర్ కేసు, రంగనాయకమ్మకు సీఐడీ నోటీసుల అంశం. నర్సీపట్నం మత్తు వైద్యుడు సుధాకర్ విషయాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని హైకోర్టు కూడా టేకప్ చేయడంతో దీనిపై మరింత దృష్టి సారించారు. ఓ వైద్యుడిని వేధిస్తోందన్న అంశాన్ని హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

 

 

అలాగే కొత్తగా రంగనాయకమ్మ కేసును కూడా హైలెట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారన్న అభియోగం పై గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ అనే మహిళ మీద సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తప్పుడు పోస్టింగ్ పెట్టారంటూ రంగనాయకమ్మకు సీఐడీ సీఐ దిలీప్ కుమార్ నోటీసును అందజేశారు.

 

 

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, సామాజిక మాధ్యమాల్లో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే సీఐడీ నోటీసులిస్తుందా అని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి విమర్శలను స్వీకరించే స్థితిలో లేరన్నారు. ఏదో ఒకరోజు ఆయన తన అహంకారపూరిత చర్యలకు మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు అంటున్నారు. ఇక తెలుగుదేశం నేతలు స్వయంగా రంగనాయకమ్మను స్వయంగా కలిసి మద్దతు తెలిపారు.

 

 

అయితే గతంలో చంద్రబాబు హయాంలో ఎందరో సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయించి.. పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పించిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అలా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఎవరిపైన కేసు పెట్టడానికి వీలు లేదని చెప్పడం విడ్డూరం అంటున్నారు. మరి చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రెండు కొత్త అస్త్రాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Fight .. fight the fit .. fit the fight .. reflective mirrors , laterally inverted imagery .. and the inspiration with Grandson ..

A post shared by amitabh Bachchan (@amitabhbachchan) on

మరింత సమాచారం తెలుసుకోండి: