హన్సిక.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టీనేజ్ వయసులోనే కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది ఈ యాపిల్ బ్యూటి. హన్సిక చాలా సీరియళ్లలోను, సినిమాల్లోనూ చిన్నతనంలోనే నటించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై, వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి మెప్పించింది.
ఇక 2007లో పూరీజగన్నాధ్ తీసిన `దేశముదురు` సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే హిట్ కొట్టడమే కాకుండా అందరి దృష్టినీ తన వైపుకు ఈజీగా తిప్పుకుంది. ఆ తర్వాత 2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కంత్రీ సినిమాలో నటించగా.. రామ్‌తో మస్కా చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది.
కానీ, ఆ తర్వత తెలుగులో సరైన హిట్ లేకపోవడంతో.. తమిళ సినిమాలవైపు మొగ్గు చూపింది. అక్కడ ప్రస్తుతం బిజీ హీరోయిన్గా మారిపోయింది హన్సిక. తెలుగులో సైతం అప్పుడప్పుడు తళుక్కున మెరిసి అలరిస్తోంది. తెలుగులో హన్సిక చివరగా నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్. సందీప్ కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ప్రస్తుతం హీరోయిన్‌కు ప్రధాన్యం ఉన్న కథాంశంతో తెరకెక్కుతున్న మహా అనే చిత్రంలో శింబు, హన్సిక కలిసి నటిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ హన్సిక హాట్ పిక్స్‌తో రచ్చ చేస్తోంది. తాజాగా కూడా హన్సిక హాట్ హాట్ అందాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.