సెలబ్రిటీల పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ బాడీగార్డులు లేకపోతే వారు బయట అడుగుపెట్టలేరు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఆలియా భట్, అమితాబచ్చన్ వంటి బడా సెలబ్రెటీలు తమ బాడీగార్డులకు కోట్ల రూపాయల వేతనం ఇస్తున్నారు అంటే వారు తమ జీవితంలో ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకులనుండి, చెడ్డ వారి నుండి తమ యజమానులకు ఎటువంటి హాని జరగకుండా ప్రతి క్షణము అప్రమత్తంగా ఉండే బాడీగార్డుల డ్యూటీ అంత సులభమైనది కాదు అని చెప్పవచ్చు. 

IHG
ఎప్పుడూ వెన్నంటే ఉండే బాడీ గార్డులు సెలబ్రిటీ లతో మంచి అనుబంధం ఏర్పరచుకుంటారు. ఆ సెలబ్రిటీల ఫ్యామిలీలో ఒకరిగా బాడీ గార్డులు మిగిలిపోతారన్నది అక్షరాల నిజమని చెప్పుకోవచ్చు. అలాంటి బాడీగార్డులు చనిపోతే తమ సెలబ్రిటీలైన యజమానులు తీవ్ర విషాదం లో మునిగిపోతారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా తనని ఎన్నో ఏళ్ల పాటు కాపాడిన బాడీగార్డు పోవడంతో తీవ్ర విషాదం లో మునిగిపోయాడు. 

IHG
పూర్తి వివరాలు తెలుసుకుంటే... తమిళ హీరో సూర్యకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, విజయ్ మోహన్ లాల్ వంటి బడా హీరోలకు బాడీగార్డ్ గా పనిచేసిన కేరళ వ్యక్తి దాస్ చేతన్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ కేరళలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దాస్ చేతన్ వయసు 47 సంవత్సరాలు మాత్రమే. గత కొంతకాలంగా చికిత్స స్పందించని దాస్ చేతన్ ఈ రోజు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి సురేష్, మలయాళం యాక్టర్ పృథ్వీరాజ్ తదితర సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. అలాగే సోషల్ మాధ్యమాలలో నెటిజనులు దాస్ చేతన్ ఆత్మకి శాంతి కలగాలని పోస్టులు పెట్టడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: