చిరంజీవి రాజకీయాల్లోకి రాక ముందు సమాజ సేవ లక్ష్యంగా చేసిన సినిమా స్టాలిన్. ఆ స్టాలిన్ సినిమా ఆయన కెరీర్ లో ఒక మైలురాయి అవుతుంది అని భావించారు చాలా మంది. కాని కథలో పట్టు లేక ఈ సినిమా షాక్ ఇచ్చింది. ఈ సినిమాను భారీ అంచనాలతో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. దీనికి ప్రచారం కూడా ఒక రేంజ్ లో చేసారు అని చెప్పాలి. ఇక అందుకే చిరంజీవి అభిమానులు కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆశగా ఎదురు చూసారు అనే చెప్పాలి. సినిమాలో ఉన్న సామాజిక కోణం అనే కాన్సెప్ట్ చాలా మందికి ఎక్కలేదు. 

 

మాస్ ఆడియన్స్ చిరంజీవి నుంచి అలాంటి సినిమాలు కాదు ఆశించేది ఆయన నుంచి ప్రేక్షకులు ఎక్కువగా యాక్షన్ సినిమాలను ఆశిస్తారు అని అంటారు. ఈ సినిమాతో అది నిజమే అనే విషయం స్పష్టంగా అర్ధమైంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేశారు. రాజకీయాల్లో ఆయనకు ఈ సినిమా ప్లస్ అవుతుంది అని భావించినా సరే సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన మాస్ సినిమాలనే ఎక్కువగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

 ఆయన సినిమాల్లో ఎక్కువగా ఇప్పుడు మాస్ ని ఆకట్టుకునే విధంగా కోణాలు ఉండే విధంగా జాగ్రత్తలు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి కొంచెం మాస్ మీద దృష్టి  పెట్టడం తో పాటుగా క్లాస్ ని కూడా ఆకట్టుకునే విధంగా అడుగులు వేస్తున్నారు అనే చెప్పాలి. స్టాలిన్ సినిమా పెద్ద స్క్రీన్ మీద ఎవరూ చూడలేదు గాని చిన్న స్క్రీన్ మీద మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే ఆదరించారు అని చెప్పాలి. వారికే ఈ సినిమా ఎక్కువగా నచ్చింది కాబట్టి సినిమాను మిస్ అవకుండా చూస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: