కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో బీభత్సమైన ఫామ్ లో ఉంది. ఛలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమా హిట్ అవడం ఆ తర్వాత నటించిన గీతా గోవిందం సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అవడంతో అమ్మడి క్రేజ్ పీక్స్ కు చేరింది. ఇక వరుస ఆఫర్లు వాటితో పాటుగా హిట్లు ఇలా కెరియర్ ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న రష్మిక మందన్న తెలుగు తర్వాత కోలీవుడ్ పరిశ్రమపై కన్నేసింది. ఆల్రెడీ అక్కడ కార్తి సరసన సినిమా చేస్తున్న రష్మిక తన సెకంద్ సినిమాని కూడా కన్ఫర్మ్ చేసుకుంది. 


ఇళయదళపతి విజయ్, క్రేజీ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో తుపాకి సీక్వల్ గా వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ మూవీలో ముందు కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారంటూ వారలు వచ్చాయి. తుపాకి సినిమాలో విజయ్ సరసన కాజల్ నటించింది. సీక్వల్ లో కూడా అమ్మడికి ఛాన్స్ ఇచ్చారని అన్నారు. కాని అసలు విషయం ఏంటంటే కాజల్ ప్లేస్ లో రష్మిక లక్కీ ఛాన్స్ అందుకుందట. 

 

తెలుగులో ఈ ఇయర్ మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది. ఇక ఇదే కాకుండా మరో రెండు టాలీవుడ్ స్టార్ ప్రాజెక్టులు అమ్మడి చేతిలో ఉన్నాయని తెలుస్తుంది. ఫాం లో ఉన్న బ్యూటీ కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఆమె వెంట పడుతున్నారు. అందం, అభినయం రెండు కలిసిన రష్మిక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దూసుకెళ్తుంది. ఇదే ఫాం కొనసాగిస్తే సౌత్ లో నంబర్ 1 పొజిషన్ లో రష్మికను చూస్తామని చెప్పొచ్చు. అమ్మడికి ఆ అర్హత ఉందని అంటున్నారు సిని విశ్లేషకులు.   

మరింత సమాచారం తెలుసుకోండి: