బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఒక్క ఇండస్ట్రీనే కాదు.. ఆయను అభిమానించే అభిమానుల మనసు కూడా కలచి వేస్తుంది.  ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  నటించిన ‘ధోని’ మూవీ జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  హీరో అంటే కోట్ల మందికి అభిమానం కలిగింది.  బాలీవుడ్ లో కొంత మంది పెద్దలు చేసిన పాపం.. అతనికి సినిమా ఛాన్సులు లేకుండా చేయడం బంధుప్రీతి లాంటి కారణాల వల్ల రెండు సంవత్సరాల నుంచి మానసికంగా వత్తిడి కి గురయ్యాడ.  ఇక కరోనా కారణంగా ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే.

 

అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్  డిప్రెషన్ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పెద్దలనే కాదు, చిన్నారులనూ బాధిస్తోంది. నటుడి మరణాన్ని తట్టుకోలేక ఒడిశాలోని కటక్‌లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో 13 ఏళ్ల బాలిక ఉండడం గమనార్హం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

 

మొన్న పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆ తర్వాత ఓ మైనర్ అమ్మాయి.. నిన్న మరో మహిళ ఇలా సుశాంత్ ఆత్మహత్య జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. జగత్‌సింగ్‌పూర్‌కు చెందిన నిరంజన్‌రెడ్డి (55) తన కార్యాలయం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకొని ఐన వారికి ఇబ్బంది పెట్టవొద్దని అంటున్నారు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: