మాగంటి మురళీమోహన్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నాయకుడు, తెలుగు సినీ తెరపై కొన్ని దశాబ్దాల పాటు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్టుగా చక్రం తిప్పిన ముర‌ళీమోహ‌న్‌.. నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా కూడా స‌త్తా చాటారు. 1973లో ఈయన అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన `జగమేమాయ` చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ముర‌ళీమోహ‌న్‌..  తిరుపతి సినిమాతో హిట్ అందుకున్నారు.

IHG

ముర‌ళీమోహ‌న్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించాడు. అలాగే తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాని ద్వారా 25 చిత్రాలను నిర్మించాడు. ఇక అటు రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాన్ని కూడా ఏలారీయ‌న‌. ఇప్పటికీ ఆయా వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు. ముర‌ళీమోహ‌న్ రాజ‌కీయ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న ముందు తెలుగు దేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. 

IHG

ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో 2,147 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. అయితే, పట్టువదలని విక్రమార్కుడిగా ఇక్కడ నుంచి గెలిచి తీరాలని నిర్ణయించుకున్న మురళీ మోహన్‌ 2014లో మరోసారి పోటీ చేసి ఘ‌న విజయం సాధించారు. అంత‌కు ముందు ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఐదేళ్ల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిర‌గ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ఆయ‌న్ను ఏకంగా 1.57 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెపించారు. ఇలా న‌టుడిగా, నిర్మాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా, వ్యాపార‌వేత్త స‌త్తా చాటిన ముర‌ళీమోహ‌న్ నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టిన రోజులు ఆయ‌న మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుందాం.


 

మరింత సమాచారం తెలుసుకోండి: