ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ గేమ్ మారిపోతోంది. స్టార్ హీరోయిన్ల రేసులో తేడాలొస్తున్నాయి. ఇన్నాళ్లు ద్విముఖపోరుగా ఉన్న నంబర్ గేమ్ కాస్తా ఇప్పుడు త్రిముఖ పోరుగా మారింది. మహానటి రేసులోకి రావడంతో కన్నడ బ్యూటీస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. 

 

టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ కోసం కన్నడ బ్యూటీస్ పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ పోటీ పడుతున్నారు. స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ నంబర్ వన్ అనిపించుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్లకు గట్టి పోటీ ఇవ్వడానికి మహానటి రంగంలోకి దిగింది. 

 

పూజా హెగ్డే ఇపుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. టాప్ రేసులో ఉన్న అందరి హీరోలతో సినిమాలు చేస్తూ టాప్ చైర్ అందుకోవడానికి పోటీపడుతోంది. ఒకవైపు ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో రొమాన్స్ చేస్తూనే.. మరోవైపు యంగ్ స్టర్స్ వరుణ్ తేజ్, అఖిల్ లాంటి వాళ్లను కవర్ చేస్తోంది. దీంతో ఏడాది అంతా బిజీగా ఉంటోంది పూజ. 

 

బబ్లీ రోల్స్ తో కుర్రాళ్లను మాయ చేస్తోన్న హీరోయిన్ రష్మిక మందన్న. ఐ యామ్ ఇంప్రెస్డ్ అంటూ యూత్ ని ఫిదా చేస్తున్న ఈ కన్నడ బ్యూటీకి స్టార్లంతా ఫిదా అవుతున్నారు. ఈమెతో స్టెప్పులేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. స్టార్ మేకర్స్ కూడా రష్మికను ఫస్ట్ ఛాయిస్ గా చూస్తున్నారు. ఈ క్వాలిటీస్ తోనే టాప్ ఛైర్ ని టార్గెట్ చేస్తోంది రష్మిక.

 

బోల్డంత టాలెంట్ ఉంది. నేషనల్ అవార్డు కూడా ఉంది. కానీ నెంబర్ గేమ్ లో మాత్రం బెర్త్ దక్కట్లేదు. కీర్తి సురేష్ ఇంక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసుకోవాల్సిందే అనే మాటలు వినిపిస్తున్న టైమ్ లో రేసులోకి దూసుకొచ్చింది మహానటి. 

 

గ్లామర్ కంటే పెర్ఫామెన్స్ కే ప్రియారిటీ ఇస్తూ కెరీర్ లాగిస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్. మహానటితో నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే కంటెంట్ ఉ్ననా ఈ బ్యూటీ మాత్రం టాప్ రేసులో అడుగుపెట్టలేకపోయింది. అజ్ఞాతవాసి తర్వాత కీర్తికి భారీ సినిమాల్లో అవకాశాలు రాలేదు. 

 

మహానటి తర్వాత కీర్తి వరుసగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేసింది. పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించింది. దీంతో కీర్తి కమర్షియల్ మూవీస్ కి దూరమవుతోందినీ.. మహానటి కెరీర్ క్లైమాక్స్ కు చేరుతోందనే ప్రచారం జరిగింది. అయితే మహేశ్.. సర్కారు వారి పాటలో అవకాశం అందుకొని ఈ మాటలకు బ్రేకులేసింది కీర్తి. 

 

మహేశ్ బాబు సర్కార్ వారి పాట సినిమాకు టైటిల్ లోగోతోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ క్రేజీ మూవీలో నటిస్తే కీర్తి కెరీర్ కు బూస్టప్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఈమెకున్న కంటెంట్ తో నంబర్ వన్ రేసులోనూ అడుగుపెడుతుందని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: