టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్ 20వ సినిమాగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ఫుల్ హీరోయిన్ పూజ హెగ్డే, ప్రభాస్ తో జతకడుతున్న ఈ సినిమాని గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ప్రభాస్ కు తల్లిగా ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, టాలీవుడ్ సహా పలు ఇతర భాషల నటులు ఇందులో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక ఈ సినిమా తరువాత మహానటి దర్శకుడు నాగఅశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వినీదత్ ఎంతో భారీ లెవెల్లో, ప్రభాస్ 21వ సినిమాగా తెరకెక్కించనున్న ఈ మూవీకి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఆకట్టుకునే కథ, కథనాలతో సైన్స్ ఫిక్షన్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి కాసేపటి క్రితం వైజయంతి మూవీస్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ప్రకటన రిలీజ్ చేసారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రభాస్ 21 కు సంబంధించి పెద్ద సర్ప్రైజ్ ఉండబోతోందని, మన డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఆ సమయానికి సిద్ధంగా ఉండండి అంటూ వారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. 

 

దానితో ఒక్కసారిగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అమితానందంతో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవడం, దాని తరువాత సరిగ్గా తొమ్మిదిరోజుల అనంతరం ప్రభాస్ 21 కు సంబంధించి సర్ప్రైజ్ కూడా ఉండబోతుండడంతో, వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి రేపు ఉదయం ఈ సినిమాకు సంబంధించి వైజయంతి బ్యానర్ నుండి ఎటువంటి అప్ డేట్ వస్తుందో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: