ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు, అవకాశాలతో దూసుకెళ్తున్న వారిలో శ్రద్ధా కపూర్ ఒకరు. సీనియర్ బాలీవుడ్ యాక్టర్ శక్తి కపూర్ కూతురైన శ్రద్ధ, కొన్నేళ్ల క్రితం వచ్చిన ఆషికి 2 మూవీ తో హీరోయిన్ గా అడుగుపెట్టి, ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలు అందుకున్న శ్రద్దా, వాటిని విజయాలు గా మలుచుకుంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమాలో హీరోయిన్ గా, ఫస్ట్ టైం సౌత్ మూవీలో నటించిన శ్రద్ధా, దానిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కానీ ఊహించని విధముగా సాహో, సౌత్ లో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది, అయితే నార్త్ లో మాత్రం ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ లభించాయి. ఆ విధంగా సౌత్ లో హీరోయిన్ గా ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన తనకు సాహో మూవీ ఇచ్చిన ఫలితంతో బుర్ర గిర్రున తిరిగిందని, అందువలన ఇటీవల ఒక టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ వచ్చినప్పటికీ, దానిని అంగీకరించడానికి కొంత సమయం అడిగిందట శ్రద్ధా. కేవలం ఆ ఒక్క సినిమానే కాక, కొద్దిరోజులుగా మధ్యలో మరికొన్ని సౌత్ ఆఫర్స్ వచ్చినప్పటికీ, అవి తనకు సంతృప్తికరంగా అనిపించడకపోవడంతో వాటిని ఆమె అంగీకరించలేదట.
మరి ప్రస్తుతం వచ్చిన ఈ బడా టాలీవుడ్ అఫర్ ని ఆమె ఎంతవరకు ఒప్పుకుంటారు అనేది కొంత సందేహమే అంటూ వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఎలాగైనా తమ సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని, ఆ సినిమా దర్శక, నిర్మాతలు చూస్తున్నారట. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారికంగా న్యూస్ బయటకు రానప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం మరొక్కసారి టాలీవుడ్ తెరపై శ్రద్ధా ని చూడవచ్చన్నమాట .....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి