టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య, క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే సినిమాతో 2011లో తెరంగేట్రం చేసాడు. ఆ తరువాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే మూవీతో మంచి సక్సెస్ అందుకున్న నాగ శౌర్య, అనంతరం వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు. కాగా ఇటీవల యువ దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో సినిమా, శౌర్య కు కమర్షియల్ గా మంచి సక్సెస్ ని అందించింది. రష్మిక మందన్న టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ సినిమా మంచి ఎంటర్టైనింగ్, యాక్షన్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది. 

IHG

అయితే ఆతరువాత శౌర్య నటించిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇటీవల సొంత బ్యానర్ పై తన తల్లిదండ్రులు ఉష, శంకర్ ప్రసాద్ నిర్మాతలుగా, యువ దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగ శౌర్య నటించిన అశ్వద్ధామ సినిమా మంచి హిట్ కొట్టి, ఆయనకు కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని అందించింది. ప్రస్తుతం శౌర్య కెరీర్ 20వ సినిమాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఒక మూవీ అతి త్వరలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పురాతనమైన ఒక విలువిద్యకు సంబంధించి ఆకట్టుకునే కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. నేడు కాసేపటి క్రితం దీని ఫస్ట్ లుక్ పోస్టర్ ని సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

 

పోస్టర్ లో విల్లు పట్టుకుని సిక్స్ ప్యాక్ బడీ తో హాలీవుడ్ రేంజ్ లో నాగశౌర్య కనపడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని పాత్ర కోసం సిక్స్ ప్యాక్ తో పాటు పూర్తిగా గడ్డం, జుట్టు పెంచిన నాగ శౌర్య, ఈ సినిమాలో ఇప్పటివరకు నటించని సరికొత్త రోల్ లో కనిపించనున్నట్లు టాక్. ఇటీవల సుమంత్ హీరోగా తెరకెక్కిన సుభ్రహ్మణ్యపురం సినిమాకి దర్శకత్వం వహించిన సంతోష్ జగర్లాపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. అతి త్వరలో త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: