నందమూరి బాలకృష్ణ కోరుకున్న సూపర్ హిట్ ను ‘లెజెండ్’ ద్వారా అందించి బాలయ్యకు మంచి జోష్ కలిగించడమే కాకుండా జరగబోతున్న ఎన్నికలలో బాలకృష్ణ పాపులారిటీ పెంచిన దర్శకుడు బోయపాటి శ్రీను తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ పై కామెంట్స్ చేసాడు.
మోక్షజ్ఞ ను తాను మొదటిసారి ‘లెజెండ్’ సినిమా సెట్ల పైనే చూసాననీ అయితే బాలయ్య ‘లెజెండ్’ సినిమాలో ఉపయోగించిన బైక్ పై మోక్షజ్ఞ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ అందర్నీ ఆకర్షించిన సందర్భంలో లెజెండ్ సినిమా నిర్మాతలు మోక్షజ్ఞ తో సినిమా చేసే అవకాశం తమకు ఇమ్మని బాలయ్యను అడిగినప్పుడు తాను పక్కన ఉండటంతో మోక్షజ్ఞ చేయబోయే మొదటి సినిమాకు తానే దర్శకత్వం వహించబోతున్నానని మీడియా వార్తలు వ్రాసింది అని అన్నారు బోయపాటి.
కాని వాస్తవానికి మోక్షజ్ఞ హీరోగా రూపురేఖలు దిద్దుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని తన వ్యక్తిగత అభిప్రాయం అని అంటూ ఇదే విషయాన్ని తాను బాలయ్యకు కూడ చెప్పానని బాలకృష్ణ కూడ అదే అభిప్రాయంలో ఉన్నాడని బోయపాటి వెల్లడించాడు.
ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది అప్పటి పరిస్థితులను బట్టి బాలకృష్ణ నిర్ణయం తీసుకుంటారని బోయాపాటి చెపుతున్నాడు. బాలకృష్ణతో రెండు సూపర్ హిట్లు చేసిన తరువాత మూడవ సినిమా బాలయ్యతో చేయాలనే కోరిక ఉన్నా అభిమానుల అంచనాలను అందుకునే కధ దొరికితేనే చేస్తాను లేకుంటే బాలయ్య పేరును చెడ కొట్టే సినిమాలు మాత్రం చేయను అని చెపుతున్నాడు బోయపాటి.
మరింత సమాచారం తెలుసుకోండి: