కంగనా రనౌత్ హృతిక్ రోషన్ వంటి టాప్ స్టార్లు పహ్లాజ్ నిహలానీ నితీస్ తివారీ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలు అయోధ్య రాముడుకి సినిమా హారతులు పట్టేందుకు రెడీ అవుతున్నారు. దూరదర్శన్ లో 30 సంవత్సరాల రామాయణ్ సీరియల్ ను లాక్ డౌన్ సమయంలో తిరిగి ప్రసారం చేసినప్పుడు కోట్లాదిమంది చూసిన విషయం తెలిసిందే. దీనితో జనం మధ్య రామాయణ మ్యానియా ఇంత ఎక్కువగా ఉందని గ్రహించి అనేక భారీ సినిమాలకు రంగం సిద్ధం అవుతుంది.
ప్రముఖ నిర్మాత సెన్సార్ బోర్డ్ మాజీ చైర్మన్ పహ్లాద్ నిహలానీ రాముడి కథను నేటితరం ప్రేక్షకులకు అర్ధం అయ్యే విధంగా ‘అయోధ్యకి కథ’ అనే మూవీని సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తీయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ‘మణికర్ణిక’ మూవీతో సంచలనాలు సృష్టించిన కంగనా రనౌత్ ‘అపరాజిత అయోధ్య’ పేరిట ఒక సినిమాను తీయడానికి ప్రయత్నిస్తూ ఈ స్క్రిప్ట్ రచనను చేయవలసిందిగా విజయేంద్ర ప్రసాద్ ను కోరింది.
చరిత్రలో బాబర్ ఎందుకు అయోధ్య రామాలయాన్ని ఎందుకు కూలగొట్టాడు అన్న విషయం చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. అమీర్ ఖాన్ ‘దంగల్’ తీసిన ప్రముఖ దర్శకుడు తివారీ ప్రస్తుతం రామాయణ స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. ఈ మూవీలో అమీర్ ఖాన్ లేదంటే హృతిక్ రోషన్ లు నటించే ఆస్కారం ఉంది. ఇలా ప్రస్తుతం బాలీవుడ్ ఈ కరోనా సమయంలో కూడ రామజపం చేస్తూ రాముడి మ్యానియాను ఉపయోగించుకుని వేల కోట్లు కొల్లగొట్టాలని రామ జపం చేస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి