మహేష్ ఈ పేరులో ఉన్న వైబ్రేషన్ టాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసి వారి మనసులు దోచేసింది... పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా అదే గ్లామర్ తో అమ్మాయిల కలల రాకుమారుడిగానే కొనసాగుతున్నాడు ప్రిన్స్. ప్రస్తుతం సోషల్ ఓరియంటెడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నాడు మహేష్.
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నారు మహేష్.. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు ప్రిన్స్.




అయితే ఈ సినిమా ప్లాను ను చిత్ర బృందం మార్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే మన తెలుగు సినీ ప్రేక్షకులకు పరిమితమైన మహేష్ ను ఇండియా హీరోగా చూడాలనుకుంటున్నారు వారి అభిమానులు. కాగా వీరి ఆకాంక్షను నిజం చేయాలనుకున్న ప్రిన్స్ "సర్కార్ వారి పాట" సినిమాతోనే పునాది వేయాలని అనుకుంటున్నారట మహేష్.. ఈ దిశగా సర్కార్ వారి పాట సినిమాను మొదట తెలుగులో తీసి తరువాత అన్ని భాషల్లో చిత్రీకరించాలని పెద్ద ప్లాన్ చేశాడట దర్శకుడు.. ఇప్పటికే సర్కార్ వారి పాట సినిమాను పాన్ ఇండియా మూవీ గా చేయడానికి కావలసిన స్కెచ్ ను రెడీ చేసుకునే పనిలో పడ్డారట దర్శకుడు..




మహేష్ కెరియర్లో 27వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంతో మహేష్ ను ఎలా అయినా పాన్ ఇండియా హీరోగా తన దర్శకత్వంలో పరిచయం చేయాలనుకుంటున్నాడట దర్శకుడు పరశురాం... ఇదే టార్గెట్ గా చేసుకొని ఇది మా కావలసిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ను కలెక్ట్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్. అందులోనూ ఈ కథ అన్ని వర్గాల ప్రజలకు నచ్చేలా ఉండడంతో మహేష్ పాన్ ఇండియా హీరోగా మార్చడానికి ఇదే సరైన అస్త్రం అని ఫీల్ అవుతున్నారట ఈ సినీ దర్శకుడు. ఇది ఇంతవరకు సినిమా ఫలితాన్ని మారుస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: