రాయలసీమకు చెందిన రాజకీయ నేత తనయురాలితో ప్రదీప్ పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాడని టాక్. కొన్నాళ్ళుగా పెళ్ళి గురిచి విశ్వప్రయత్నాలు చేస్తున్న ప్రదీప్ త్వరలోనే తను చేసుకునే అమ్మాయి గురించి ఓ సర్ ప్రైజ్ న్యూస్ చెప్పబోతున్నాడని అంటున్నారు. ఈటివి, జీ తెలుగు రెండిటిలో క్రేజీ షోస్ చేస్తుంటాడు ప్రదీప్. ఢీ షోకి ప్రదీప్ యాంకరింగ్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. సుధీర్, రష్మి, ఆదిలతో కలిసి ప్రదీప్ చేసే గోల ఓ రేంజ్ లో ఉంటుంది.
పెళ్ళికి సంబందించిన షో ఏదైనా అయితే ప్రదీప్ కు పంచులు పడతాయి. యాంకర్ గా తన మార్క్ చూపించడంలో క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ తన స్కిల్స్ తో ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ హీరోగా మొదటి ప్రయత్నంగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బెంగుళూరు భామ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సినిమాను మున్నా డైరెక్ట్ చేయగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. కెరియర్ సూపర్ సక్సెస్ గా ఉన్న ప్రదీప్ పెళ్ళిపై కొన్నాళ్ళుగా క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే లేటెస్ట్ గా వచ్చిన వార్తలు మాత్రం వాస్తవం అనిపించేలా ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి