పండుగ అంటే మాములుగా అయితే ఈటివిలో సందడి ఉంటుంది. కాని ఈసారి ఆ ఛాన్స్ స్టార్ మా కొట్టేసింది. బిగ్ బాస్ సీజన్ 4 నడుస్తున్న ఇలాంటి టైం లో దసరా పండుగ రావడం నాగార్జున షూటింగ్ కు మనాలి వెళ్ళడం.. ఆయన ప్లేస్ లో అక్కినేని కోడలు సమంత రావడం క్రేజీగా మారింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఆడియెన్స్ పండుగని రెట్టింపు చేసేలా దుమ్ముదులిపే స్కెచ్ వేశారు.

బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ చాలా స్పెషల్.. సెప్టెంబర్ 6న మొదలైన ఈ షో అక్టోబర్ 25కి 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు దసరా సందర్భంగా షో కలర్ ఫుల్ గా ఉండనుంది. అండ్ ఫైనల్ గా సమంత హోస్ట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేయనుంది. పండుగ సందర్భంగా దసరాకి ఆడియెన్స్ అందరు ఫుల్ ఖుషీ అయ్యేలా ఈ ప్రోగ్రాం వస్తుంది.

స్పెషల్ ఎట్రాక్షన్ కింద సమంతతో పాటుగా కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లు వచ్చారు. అంతేనా అక్కినేని యువ హీరో అఖిల్ కూడా షోలో సందడి చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా ప్రమోషన్ తో పాటుగా నాన్న మిస్సవుతున్న ఎపిసోడ్ లో తనవంతు భాగంగా వదినకు సపోర్ట్ గా ఉండటానికి వచ్చాడు అఖిల్. మొత్తానికి దసరా స్పెషల్ ఎపిసోడ్ నిజంగానే స్పెషల్ అనిపించేలా ప్లాన్ చేశారు. చూస్తుంటే ఈ షోకి మంచి రేటింగ్స్ వచ్చేలా ఉందని చెప్పొచ్చు.                                                                    


మరింత సమాచారం తెలుసుకోండి: