బిగ్ బాస్ హౌస్ లో వచ్చినప్పుడు అర్జున్ రెడ్డి లాగా తెగ బిల్డప్ ఇచ్చి , ఇప్పుడు మాత్రం నలుగురి దారిలోనే నేను అని ముందుకు సాగుతున్నాడు..సొహైల్.. ఈ చాక్లెట్ బాయ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. అలాంటి ఇతను సడెన్ గా పొలిటీషియన్ గా మారాడు.  రాజకీయ నాయకుల గురించి అన్నిటినీ పూస గుచ్చినట్లు చెప్తున్నాడు. అందుకే ఇప్పుడు హౌస్ లో రియల్ హీరో అయ్యాడు..నాగార్జున సలహా మేరకు అరవడం మానేసి కూల్‌గా మాట్లాడటం నేర్చుకుని తన గేమ్ స్ట్రాటజీ మార్చుకున్నాడు. దీంతో రెండు మూడు వారాల్లోనే సొహైల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టైటిల్ రేస్‌లోకి వచ్చేయడంతో సొహెల్ సోషల్ మీడియాలో చర్చ నియాంశంగా మారాడు..



అయితే ఇతను గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.తనకు ప్రేరణ వైఎస్ జగన్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు సొహైల్. జగన్ గ్రేట్ అనడంలో అతిశయోక్తి లేదు..ఒక యంగ్ లీడర్ తండ్రి చనిపోయిన తరువాత ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం.. అధికార పార్టీతో కొట్లాడి పాదయాత్ర చేసి రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఎవరి సపోర్ట్‌ లేకుండా సొంతంగా పార్టీ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ప్రజలకు మేలు చేయాలని,తండ్రి కోరికను తీర్చుకోవడానికి అహర్నిశలు శ్రమించి ఇప్పుడు ఒక మహానాయకుడు అయ్యాడు..



అందుకే జగన్ ఆదర్శంగా తీసుకున్నా అంటూ సొహెల్ అనడంతో అందరి చూపు అతని పై పడింది. కోవిడ్ టైమ్ లో కూడా ప్రజలను కాపాడటానికి ఎంతో కష్ట పడ్డాడు..ఇక రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఇలా చెప్పుకుంటూ పోతే తన తండ్రిని మించి పోయేలా ఉన్నాడు. అలా చేయడం మాటలు కాదు.. రాష్ట్ర నిధులు లేకపోయినా కూడా అప్పు తెచ్చి మరి అందరి ఆకలిని తీర్చాడు. రియల్ హీరో అంటే నా దృష్టిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యి కూర్చుంది.. మొత్తానికి సొహైల్ విన్నర్ అవుతాడని అనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: