ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఇస్మార్ట్ హీరో రామ్ తో కూడా త్రివిక్రమ్ పని చేయనున్నారని గత కొంతకాలంగా కథనాలొస్తున్నాయి.రామ్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్రమ్ ఓ కథ రాస్తున్నాడట. ఈ కథ కోసం త్రివిక్రమ్ కి 10 కోట్లు తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా అన్నది డౌట్ కానీ కథ స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ్ ఇస్తున్నారని సమాచారం. అయితే ఇది పక్కనపెడితే ఈ ప్రాజెక్ట్ ని 45 కోట్లతో తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. అయితే రామ్ పై ఇంత బడ్జెట్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది తెలియదు కానీ..
జులాయ్ టైప్ లో ఓ కథ కావాలని రామ్ త్రివిక్రమ్ ని కోరినట్లుగా సమాచారం.మరి రామ్ కోసం త్రివిక్రమ్ జులాయి లాంటి కథ రాసి ఇస్తాడా?లేక కథ రాయడంతో పాటు తానే స్వయంగా డైరెక్ట్ చేస్తాడా?అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగక తప్పదు అంటున్నాయి సినీ వర్గాలు..ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. ఎన్టీఆర్ rrr షూటింగ్ పూర్తి చేసి వస్తే తప్ప ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు..మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో చూడాలి...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి