టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా నారప్ప. ఇటీవల గురు, వెంకీ మామ వంటి సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుని కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఈ సినిమాపై ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల తమిళ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్ లు కలిసి ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ చాలా ఏళ్ళ తరువాత ఈ సినిమా ద్వారా వెంకీ మూవీ కి మ్యూజిక్ అందిస్తున్నారు. బ్రహ్మోత్సవం మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తీస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఎల్లుండి వెంకీ బర్త్ డే సందర్భంగా నారప్ప మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని రేపు రాత్రి 8 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది.
ఇకపోతే ఈ సినిమా యొక్క కథని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా దర్శకుడు శ్రీకాంత్ కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసినట్లు టాక్. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని, ఇక ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు హీరోయిన్ ప్రియమణి నటన కూడా సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం మరోవైపు సంగీత దర్శకుడు మణిశర్మ అదిరిపోయే ఐదు ట్యూన్స్ సిద్ధం చేయడంతో పాటు ఎంతో అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా కంపోజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి రేపు రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి