ఇది ఒక ఎత్తయితే నిజ జీవితాల కథలు తీసేటప్పుడు... ఆ వ్యక్తి యొక్క పాత్రను తెరపై ప్రతిబింబించడం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారి రూపు, నడవడిక, నటన.... ఇలాంటివన్నీ సరిగ్గా ఆ పాత్రకు సూట్ అయ్యేలా ఉండాలి. ఆ పాత్రను పోషించే వారికి కూడా ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. స్వయంగా ఆ ప్రముఖులు కళ్ళముందు కదలాడినట్లు కనపరచడం అంత తేలిక కాదు. నటుడు అరవింద్ స్వామి కూడా ఈ విషయంలో విజయాన్ని సాధించినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ 'తలైవి' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం విదితమే.
కాగా,నేడు దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) వర్దంతి. ఈ సందర్భంగా 'తలైవి' సినిమాలో పురట్చి తలైవర్... ఎంజీఆర్ పాత్రకు సంబంధించిన ఫొటోలను చేసింది ఆ చిత్ర బృందం. ఆ ఫోటోలలో స్వయానా ఎంజీఆర్ లాగే కనిపించారు అరవింద్ స్వామి. ఆ గెటప్ లో ఎంజీఆర్ ను తలపించారు నటుడు అరవింద్ స్వామి. ఆయన ఆ పాత్ర కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ఎంజీఆర్ పాత్రను అంగీకరించిన వెంటనే... డెంటిస్ట్ ను సంప్రదించి..తన పళ్లు ఎన్టీఆర్ పళ్లకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారట అరవింద్ స్వామి. అంతగా ఆయన ఆ పాత్ర కోసం ప్రాణం పెట్టి మరి ఆ పాత్రలో జీవిస్తున్నారు. ఇక తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబట్టి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అయినా అరవంద్ స్వామికి మంచి బ్రేక్ ఇచ్చి, వరుస అవకాశాలను అందుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి