ఈ సందర్భంగా మహేష్‌తో తీసుకున్న ఓ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన రణ్‌వీర్.. సూపర్‌స్టార్‌ని ఓ రేంజ్‌లో పొగిడేశారు.మహేష్ తో కలిసి పనిచేయడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపిన రణ్‌వీర్.. నేను కలిసి పనిచేయాలనుకునే, కలిసి పనిచేసిన గొప్ప వ్యక్తుల్లో మహేష్ బాబు ఒకరని అన్నారు. 'మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎప్పటికీ విలువైనవే. బిగ్ బ్రదర్ పట్ల నాకెంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి' అని పేర్కొన్నారు. ఈ సందేశం చూసిన మహేష్.. ''నీతో కలిసి పని చేయడం గ్రేట్ బ్రదర్.. ఇద్దరిదీ సేమ్ ఫీలింగ్'' అంటూ సూపర్ రిప్లై ఇచ్చారు. వీళ్లిద్దరి ఈ సంభాషణ చూసి ఇదీ సూపర్ స్టార్ రేంజ్ అంటూ తెగ మురిసిపోతున్నారు మహేష్ అభిమానులు.ఇకపోతే సూపర్ స్టార్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ నటించిన ‘83’ విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి