టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటు సినిమాలతో పాటు ప్రస్తుతం అటు పలు యాడ్స్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న పలు భాషల హీరోలు ఎవరికి కూడా లేనన్ని భారీస్థాయి యాడ్స్ సూపర్ స్టార్  చేతిలో ఉన్న విషయం తెలిసిందే. ఆరడుగులకు పైగా ఎత్తు చందమామ వంటి ప్రతిబింబం, హాలీవుడ్ హీరోలని తలపించే ముఖవర్చస్సు, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్, ఊహకందని క్రేజ్, పాపులారిటీ కలిగిన మహేష్ బాబు తమ సినిమాల్లో అలానే తమ యాడ్స్ లో పని చేస్తే చాలు తమ జన్మ ధాన్యం అయినట్లే అని ఎందరో నిర్మాతలు అలానే కంపెనీల వారు భవిస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీగా నిర్మించనున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. బ్యాంకు కుంభకోణాలు మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే కొన్నేళ్ల నుంచి ప్రముఖ శీతల పానీయం థమ్స్ అప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ నటించిన ఆ సంస్థ యొక్క లేటెస్ట్ యాడ్ నిన్న యూట్యూబ్ లో రిలీజ్ అయింది.

బాలీవుడ్ నటుడు రణబీర్ సింగ్ తో కలిసి మహేష్ బాబు ఆ యాడ్లో కనిపిస్తారు. హాలీవుడ్ స్థాయి పరిజ్ఞానంతో ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కిన ఆ యాడ్ ప్రస్తుతం యూట్యూబ్లో మంచి సందడి చేస్తుంది. ఇక ఆ యాడ్ చూసిన పలువురు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం మహేష్ బాబు అందం, అభినయానికి ముగ్ధులు అవుతున్నారు. ఇప్పటికే నార్త్ లో మహేష్ కి ఉన్న క్రేజ్, పాపులారిటీ ఎటువంటిదో అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఈ యాడ్ తో ఎక్కువమంది ఫోకస్ రణవీర్ సింగ్ కంటే మహేష్ బాబు పైనే ఉందని ఆయన కనుక రాబోయే రోజుల్లో ఒక్క బాలీవుడ్ సినిమా చేస్తే చాలు అమాంతం అక్కడి ప్రేక్షకుల నుండి విపరీతమైన క్రేజ్ దక్కించుకునే అవకాశం ఎంతో ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మహేష్ బాలీవుడ్ సినిమా చేస్తారో లేదో తెలియదు కానీ ఆయన క్రేజ్ మాత్రం అమాంతం రోజురోజుకు విపరీతంగా పెరుగుతుంది......!!

మరింత సమాచారం తెలుసుకోండి: